వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బొడ్డులో రివాల్వర్: రెచ్చిపోయిన లేడి డాన్ (వీడియో)

|
Google Oneindia TeluguNews

లక్నో: వివాదంలో ఉన్న భూమిని కబ్జా చెయ్యడానికి ఒక మహిళ తెగించింది. అందుకు ఎదుటి వారి ప్రాణాలు తియ్యడానికి సిద్దం అయ్యింది. అడ్డుకోవడానికి వెళ్లిన బాలిక మీద ట్రాక్టర్ తో తొక్కించింది. అయితే ఆమె అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడి ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నది.

ఉత్తరప్రదేశ్ లోని బిజ్ నూర్ జిల్లాలో ఒక చర్చి పక్కన ఉన్న భూమి వివాదంలో ఉంది. మెజిస్ట్రేట్ కోర్టులో కేసు విచారణలో ఉంది. ఆ పోలంలో కొందరు పంట వేసుకున్నారు. అందుకు న్యాయస్థానం అనుమతి ఉందని సమాచారం.

Woman Runs A Girl Over With A Tractor In Bijnor in Uttar Pradesh

అయితే స్థానికంగా నివాసం ఉంటున్న ఒక భూ మాఫియా డాన్ భార్య భూమిని కబ్జా చెయ్యడానికి సిద్దం అయ్యింది. ఆమె స్వయంగా ట్రాక్టర్ నడుపుకుంటూ ఆ స్థలం దగ్గరకు వెళ్లింది. బొడ్డులో రివాల్వర్ పెట్టుకుని పోలంలోని పంటను నాశనం చేసింది. అడ్డు వెళ్లిన వారిని రివాల్వర్ తో బెదిరించింది.

తరువాత అడ్డుపడుతున్న వారి మీద ట్రాక్టర్ నడిపింది. ఆ సందర్బంలో బాలిక మీద ట్రాక్టర్ వెనుక చక్రాలు దూసుకు వెళ్లాయి. బాలిక గాయాలతో బయటపడింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని లేడి డాన్ ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తీసుకు వెళ్లారు.

English summary
A dispute related to land allocated for a church led to a ruckus in front of District Magistrate’s residence in Bijnor, Uttar Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X