సంచిలో తల, గన్నీలో మొండెం : మంగళూరులో వివాహిత దారుణ హత్య

బెంగళూరు : ఏం జరిగిందో తెలియదు .. తల, మొండెం వేరే చేశారు. శరీరాన్ని రెండు పార్టులుగా చేసి అక్కడో బ్యాగు, ఇక్కడో బ్యాగు చేశారు. కర్ణాటకలో ఓ వివాహిత హత్య భయభ్రాంతులకు గురిచేస్తోంది. దారుణంగా మట్టు బెట్టి .. అవయవాలను వేరు చేసి పడేసి .. రాక్షాస ఆనందం పొందారు.

హత్య

హత్య

ఆదివారం .. హాలీడే అందరూ ఎంజాయ్ చేద్దామనుకునే సమయాన కర్ణాటకలోని మంగళూరులో ఒళ్లు గగుర్పొడిచే మర్డర్ వెలుగుచూసింది. మంగళూరులో తల, మొండెం వేరేచేసిన వివాహిత మృతదేహం లభించింది. నందిగుడలో ఓ గన్నీ బ్యాగులో మొండెన్ని గుచ్చి ఉంచారు. అవయవాలు ఉన్న సంచిని హైవే మధ్య గల నాంతూర్ వద్ద వదిలేసి వెళ్లిపాయారు.

వేరుగా ఉంటుంది ..

వేరుగా ఉంటుంది ..

చనిపోయిన వివాహిత శ్రీమతి శాస్త్రిగా పోలీసులు గుర్తించారు. ఆమె భర్తతో విడిపోయి ఉంటుందని పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని ... ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు. కానీ ఈ హత్య ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ మర్డర్ ను పోలి ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.వివాహిత పండేశ్వర్‌లో ఎలక్ట్రికల్‌ షాపు నిర్వహిస్తోంది. భర్త సుదీప్‌తో విడాకులు తీసుకున్న అనంతరం ఆమె ఒంటరిగా ఉంటోంది. అయితే ఈమె హత్యతో సుదీప్‌కు సంబంధం ఉండే అవకాశం లేదని భావిస్తున్నాం. ఎందుకంటే అతడు మొబైల్‌ చోరీ కేసులో మంగళూరు జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. మంగళూరులోని ఓ షాప్‌ ముందు మనిషి శరీర భాగాలు పడి ఉండటాన్ని యజమాని గమనించాడు. రక్తపు సంచులతో పాటు ఓ హెల్మెట్‌లో మహిళ తల ఉన్నట్లు పేర్కొన్నాడు. ఈ ఘటన గురించి లోతుగా దర్యాప్తు చేస్తున్నాం' పోలీసు అధికారి పేర్కొన్నారు.

ఢిల్లీలో సేమ్ సీన్ ..

ఢిల్లీలో సేమ్ సీన్ ..

ఢిల్లీలోని అమృత్ విహార్‌లో రాజేశ్, సునీత దంపతులు ఉంటున్నారు. కానీ వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. దీంతో భర్త రాజేశ్ ను మట్టుబెట్టింది భార్య. తర్వాత మృతదేహన్ని 8 భాగాలుగా చేసి ... ఖననం చేసింది. తలను డ్రైనేజీలో పడేసింది. నెల తర్వాత రాజేశ్ ఆచూకీ తెలియడం లేదని గుర్తించారు. తర్వాత సునీతను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే .. చేసిన నేరాన్ని అంగీకరించింది. ఈ కేసులో కూడా వివాహిత భర్త చంపి ఉంటాడా అని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+