సూట్‌కేసులో యువతి మృతదేహం, పక్కనే తల
సూట్‌కేసులో తలలేని యువతి మృతదేహన్ని నవీ ముంబైలోని ఫామ్‌బీచ్ రోడ్డులోని ఓ ఫామ్‌హౌజ్ సమీపంలో పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.
ముంబై: సూట్‌కేసులో తలలేని యువతి మృతదేహన్ని నవీ ముంబైలోని ఫామ్‌బీచ్ రోడ్డులోని ఓ ఫామ్‌హౌజ్ సమీపంలో పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.
ఇరవై ఏళ్ళ గుర్తు తెలియని యువతిపై అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఫామ్ హౌజ్ యజమాని మహేంద్ర టాండెల్ మార్నింగ్ వాక్ చేస్తుండగా యువతి మృతదేహం ఉన్న సూట్ కేసు కన్పించిందని ఆయన పోలీసులకు సమాచారం అందించారు.

సూట్‌కేసుకు వంద మీటర్ల దూరంలో యువతి తల కన్పించింది. యువతి అనుమానాస్పద మృతిపై పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications