ఖాళీ కంపార్టుమెంట్లో స్త్రీకి నిప్పు పెట్టిన వ్యక్తి

Woman set on fire in empty compartment
కన్నూరు: కన్నూరు - ఎర్నాకులం ఎగ్జిక్యూటివ్ ఎక్స్‌ప్రెస్ రైలు ఖాలీ కపార్టుమెంటులో ఓ మహిళకు ఓ వ్యక్తి నిప్పంటించాడు. ఈ ఘటనలో మహిళ తీవ్రంగా గాయపడింది. సోమవారం తెల్లవారు జామున ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ మహిళను 41 ఏళ్ల ఫాతిమాగా గుర్తించారు.

కాలిన గాయాల మంటలకు కేకలు పెడుతూ కపార్టెంటు నుంచి బయటకు పరుగెత్తుకొచ్చిన ఆమెను ఇతరులు చూశారు. రైలు ఎక్కడానికి వచ్చినవారికి ఆమె అలా కనిపించింది. ఈ సంఘటన సోమవారం తెల్లవారు జామున 4 గంటల 40 నిమిషాలకు జరిగింది. రైలు ఉదయం 5 గంటలకు అక్కడి నుంచి బయలుదేరాల్సి ఉంది.

సంఘటనకు ముందు ఆ మహిళ, మరో వ్యక్తి ప్లాట్‌ఫారంపై గొడవ పడడాన్ని చాలా మంది చూశారు. ఆ వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. సీసాలోని మద్యాన్ని ఆమెపైకి ఒంపి, ఆ వ్యక్తి నిప్పంటించి ఉంటాడాని భావిస్తున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. కొఝికోడ్‌ జిల్లాకు చెందిన ఫాతిమాను వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత కొఝీకోడ్ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు.

ఫాతిమా శరీరం 40 శాతం కాలిపోయింది. ఈ సంఘటనతో ఆ కంపార్టుమెంటును రైలు నుంచి వీడదీశారు. ఆ కంపార్టుమెంటును వదిలేసి రైలు ముందుకు వెళ్లిపోయింది. కంపార్టుమెంటులోని రెండు సీట్లు కూడా కాలిపోయినట్లు రైల్వే వర్గాలు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+