వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వామ్మో.. మహిళపై ఓ ఖాకీ కాల్పులు, కాపాడిన మరో కాప్.. ఎక్కడ..? ఏం జరిగిందంటే..

|
Google Oneindia TeluguNews

అతనో పోలీసు అధికారి.. భార్యతో సఖ్యత లేదు. దూరంగా ఉంటున్నాడు. మరో మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఏం జరిగిందో తెలియదు.. కానీ తనతో రిలేషన్ షిప్‌లో ఉన్న మహిళపై కాల్పుల మోత మోగించాడు. తర్వాత ఆమెను రోడ్డుపై పడేసి అక్కడనుంచి వెళ్లిపోయాడు. ఢిల్లీ నడిబొడ్డున జరిగిన ఘటన కలకలం రేపుతోంది.

 వివాహేతర సంబంధం...

వివాహేతర సంబంధం...

ఢిల్లీ లాహొరి గేట్ పీఎస్‌లో సందీప్ దహియా అనే వ్యక్తి ఎస్సైగా పనిచేస్తున్నాడు. ఇతనికీ పెళ్లయ్యింది. కానీ గొడవల వల్ల భార్య భర్తలు దూరంగా ఉంటున్నారు. అయితే మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఏం జరిగిందో తెలియదు కానీ అలీపూర్ ప్రాంతంలో మహిళపై కాల్పులు జరిపాడు. ఆమె రక్తపుమడుగులో పడి ఉండగా వెళ్లిపోయాడు. అయితే విచిత్రంగా మరో కాప్ ఆ మహిళను రక్షించాడు. ఆస్పత్రికి తీసుకెళ్లడంతో బతికి బయటపడ్డారు.

 ఏం జరిగిందంటే..

ఏం జరిగిందంటే..

కోలుకున్న మహిళ జరిగిన విషయాన్ని మహిళ తెలిపారు. తనపై కాల్పులు జరిపింది దహియా అని పేర్కొన్నది. కాల్పులు జరిపిందే తనకు గుర్తు ఉందని వెల్లడించింది. గతేడాది నుంచి తమ మధ్య సంబంధం ఉంది అని ఆమె వివరించారు. గొడవకు కారణం ఏంటో ఇంకా తెలియరాలేదు. గాయపడ్డ మహిళ కోలుకుంటున్నారని.. ఆమె పరిస్థితి స్థిమితంగా ఉంది అని వైద్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ప్రజల ప్రాణాలకు రక్షణ ఉందా..?

ప్రజల ప్రాణాలకు రక్షణ ఉందా..?

బాధ్యతగా ఉండాల్సిన పోలీసే కాల్పులు జరపడం కలకలం రేపింది. అదీ దేశ రాజధానిలో ఫైర్ చేయడం.. ఆందోళన కలిగిస్తోంది. వివాహేతర సంబంధం నేపథ్యంలో గొడవ జరిగినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు విచారణ క్రమంలో తెలుస్తోందని పేర్కొన్నది. సర్వీస్ రివాల్వర్‌తో వ్యక్తిగతంగా ఉపయోగించడం ఏంటీ అని ప్రజాసంఘాలు ప్రశ్నిస్తున్నారు. ఇలా అధికారులు గన్స్ ఉపయోగిస్తే.. ప్రజల ప్రాణాలకు రక్షణ ఏముంటుంని ఆందోళన వ్యక్తం చేశారు. దహియాపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

English summary
woman was allegedly dumped on the road after she was shot by a cop in Delhi's Alipur area.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X