దృష్టి మరల్చుతున్నారని షర్మిల బాయ్‌ఫ్రెండ్ జుత్తులాగి, చెంపపై కొట్టారు

ఇంపాల్: సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టం పైన పోరాడుతున్న ఇరోమ్ చాను షర్మిల బాయ్ ఫ్రెండ్ డెస్మండ్ కుటిన్హో పైన కొందరు మహిళలు దాడి చేశారు. ఎప్పటిలాగే షర్మిలను కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు ఆమెను తీసుకు వచ్చారు.

ఈ సందర్భంగా విచారణ పూర్తి కాగానే సేవ్ షర్మిల లుప్ మహిళా సభ్యులు కోర్టులోనే ఉన్న డెస్మండ్ పైన మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. అతని జుట్టు పట్టి ఈడ్చుకొచ్చారు. ఓ మహిళ అతని చెంప పైన కొట్టింది. అనంతరం కొందరు అతని జుట్టు పట్టుకు లాగారు. కోర్టు కాంపౌండులోకి లాక్కెళ్లారు.

Woman slaps Irom ‘boyfriend’ in Imphal

ఈ సంఘటన ఇంఫాల్ వెస్టులోని లాంపాల్‌లో జరిగింది. ఈ సమయంలో పోలీసులు కల్పించుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చి అతనిని అదుపులోకి తీసుకున్నారు.

అంతకుముందు షర్మిలను కోర్టుకు తీసుకు వచ్చారు. అతను కాసేపు షర్మిలతో మాట్లాడారు. అనంతరం అతని పైన మహిళలు దాడికి పాల్పడ్డారు.

కాగా, షర్మిలను తమ పోరాటం నుండి దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నాడని ఇతని పైన ఆరోపణలు ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం షర్మిల ఆందోళన చేస్తున్న తాత్కాలిక శిబిరాన్ని సందర్శించినప్పుడు ఇతనిని కొంత దూరం తరిమారు. డెస్మండ్ కుటిన్హో భారత సంతతికి చెందిన బ్రిటీష్ పౌరుడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+