హాలిడేస్ ట్రిప్ కు వెళ్తే వరుసగా లైంగిక వేధింపులు
లండన్: హాలిడేస్ లో సంతోషంగా గడుపుదామని వెళ్లిన యువతికి చేదు అనుభవం ఎదురైంది. రెండు రోజుల వ్యవధిలో ఆమె మీద రెండు సార్లు లైంగిక వేధింపులు చేశారు. కరీబియన్ దేశమైన డొమినికన్ రిపబ్లిక్ కు వెళ్లిన బ్రిటీష్ యువతి లైంగిక వేధింపులకు గురి కావడంతో హోటల్ రూంలో తలుపులు వేసుకుని కుర్చునే పరిస్థితి వచ్చింది.
స్థానిక మీడియా కథనం మేరకు బ్రిటన్ లోని వెస్ట్ మిడ్ లాండ్ ప్రాంతానికి చెందిన గెమ్మ ఖాన్ (25) ఇటీవల తన ముగ్గురు స్నేహితురాళ్లతో కలిసి డొమినికన్ రిపబ్లిక్ కు వెళ్లింది. అక్కడ ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో బస, ఇతర ఏర్పాట్లకు గాను ఓ ట్రావెల్ సంస్థకు భారీగానే నగదు చెల్లించుకున్నారు.
అయితే అక్కడకు వెళ్లిన తరువాత గెమ్మ ఖాన్ కు అనుకోని చేదు సంఘటనలు ఎదురయ్యాయి. ఫైవ్ స్టార్ హోటల్ లో స్విమ్మింగ్ చేసి తన రూంకు వెలుతున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు గెమ్మ ఖాన్ బికినీ విప్పడానికి విఫలయత్నం చేశారు. తరువాత ఆమెను లైంగికంగా వేధించారు.

ఆమె తప్పించుకుని తన రూంకు పరుగుతీసింది. మరుసటి రోజు ఓ మాల్ లో షాపింగ్ చెయ్యడానికి వెళ్లిన సమయంలో కొందరు వ్యక్తులు ఆమెను లైంగికంగా వేధించారు. ఆ వేధింపులు తట్టుకోలేక ఆమె నేరుగా హోటల్ లోని తన గదికి చేురుకుంది. తరువాత పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసులు కాని, హోటల్ యాజమాన్యం కాని ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోకపోవడంతో గెమ్మ ఖాన్ తన హాలిడేస్ ట్రిప్ ను రద్దు చేసుకుంది. తనకు జరిగిన అవమానం ఎవ్వరికి జరగరాదని, తన గురించి ఇక్కడ ఉన్న వారు ఎవ్వరూ పట్టించుకోలేదని ఆమె మీడియా ముందు వాపోయింది.












Click it and Unblock the Notifications