రోడ్డుపై ఘోరం: టీచర్‌ని 22సార్లు పొడిచి చంపిన ప్రేమోన్మాది, ఎవరూ కాపాడలేదు (వీడియో)
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో మంగళవారం నాడు దారుణం జరిగింది. తనను ప్రేమించలేదనే అక్కసుతో ఓ ప్రేమోన్మాది నడి వీధుల్లో అందరు చూస్తుండగా ఓ ఉపాధ్యాయురాలిని 22సార్లు పొడిచి చంపేశాడు. ఈ ఘటనను చూసిన కొందరు కూడా పట్టించుకోకుండా వెళ్లడం గమనార్హం.

నిందితుడి పేరు సురేందర్ (34). అతను గత ఏడాదిగా టీచర్ అయిన కరుణ (21) వెంట పడుతున్నాడు. ఆరు నెలల క్రితం ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు దీనిని పట్టించుకోలేదని అంటున్నారు.
కరుణ తల్లిదండ్రులు మాట్లాడుతూ.. తమ కూతురును అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని ఆరోపిస్తున్నారు. ప్రేమించలేదన్న ఆగ్రహంతోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని చెప్పారు. ఐదు నెలల క్రితం ఫిర్యాదు చేసినప్పుడు ఇరువురి మధ్య రాజీకుదిర్చారని చెబుతున్నారు. కాగా, సురేందర్‌కు ఇంతకుముందే పెళ్లయిందని, భార్య నుంచి విడాకుల కోసం కోర్టుకు వెళ్లగా, అక్కడ కేసు కొనసాగుతోందని చెబుతున్నారు.
నాడు రాజీ పడ్డారు: పోలీసులు
గతంలో ఫిర్యాదు అందిన విషయమై పోలీసులు స్పందిస్తూ.. అయిదు నెలల క్రితం సురేందర్ పైన కరుణ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అతడే ఈ ఘోరానికి పాల్పడ్డాడు. పోలీసులు మాట్లాడుతూ.. నాడు సురేందర్ పైన ఫిర్యాదు చేశారని, కానీ ఆ తర్వాత ఇరు కుటుంబాలు రాజీపడ్డాయని చెప్పారు. సురేందర్ భార్యతో విడాకుల కేసు విచారణలో ఉందన్నారు. కరుణను దారుణంగా హత్య చేసిన నిందితుడిని ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు.
-
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
ముంబాయి ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హార్డిక్ ఔట్, కొత్త కెప్టెన్ ఫిక్స్..!? -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications