వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: ఇంట్లోంచి లాగి బట్టలిప్పేసి మహిళను కొట్టారు

By Pratap
|
Google Oneindia TeluguNews

Woman stripped, beaten up in front of cops; CM orders probe
పాట్నా: దుస్తులు విప్పేసి ఓ నడి వయస్సు మహిళను గుర్తు తెలియని వ్యక్తులు కొట్టారు. బీహార్ రాష్ట్రంలోని జెహనాబాద్ జిల్లాలోని ఓ గ్రామంలో ఈ సంఘటన బుధవారం రాత్రి జరిగింది. ఈ గ్రామం రాష్ట్ర రాజధానికి కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

జులై 16, 17 తేదీల మధ్య రాత్రి ఒంటి గంటన్నర సమయంలో ఆ దారుణమైన సంఘటన చోటు చేసుకున్నట్లు గురువారం మీడియాలో వార్తలు వచ్చాయి. కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి సంగీతా దేవిని బయటకు ఈడ్చుకొచ్చారు.

తొలుత వారు మహిళ ఇంట్లో దౌర్జన్యానికి దిగారు, ఆమె దస్తులు విప్పేశారు, తన్నారు, పిడిగుద్దులు గుద్దారు. ఇదంతా ఇరుగుపొరుగువారు చూస్తుండగానే జరిగింది. ఈ సంఘటన జరుగుతున్నప్పుడు స్థానిక పోలీసులు కూడా ఉన్నారు. ఆ మహిళను రక్షించడానికి వారు ఏ విధమైన ప్రయత్నం కూడా చేయలేదు.

సంగీతా దేవితో భూలావాదేవీలు పెట్టుకున్న శక్తి సింగ్ అనే స్థానిక యువకుడి అపహరణకు గురైన నేపథ్యంలో ఆమెపై ఈ దాడి జరిగినట్లు భావిస్తున్నారు. మహిళకు అపహరణలో పాత్ర ఉందనే అనుమానంతో దురాగతానికి పాల్పడినట్లు చెబుతున్నారు.

సంగీతాదేవి తీవ్రంగా గాయపడింది. ఆమె పాట్నాలోని బీహార్ వైద్య కళాశాల ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. సంఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. ఈ సంఘటన బీహార్ అసెంబ్లీలో కూడా ప్రస్తావనకు వచ్చింది. సంఘటనపై ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించారు.

English summary
In yet another shocking incident, a middle-aged woman was stripped and badly thrashed by some unidentified men at a village in Bihar's Jehanabad district, just 50 kilometres away from the state capital, late on Wednesday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X