ఫైవ్ స్టార్ హొటల్ లో టెక్కీపై ప్రొఫెసర్ రేప్
న్యూఢిల్లీ: పెళ్లి చేసుకుంటానని నమ్మించి టెక్కి మీద ఐఐఎంకు చెందిన ఓ ప్రొఫెసర్ అత్యాచారం చేసిన సంఘటన ఢిల్లీలో వెలుగు చూసింది. ప్రొఫెసర్‌పై , ఆయనకు సహకరించిన ఇద్దరి మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
గుర్గావ్ కు చెందిన (21) యువతి ఫిర్యాదు చేశారని పోలీసులు చెప్పారు. ఢిల్లీలోని ఐఐఎంలో ఓ వ్యక్తి ప్రొఫెసర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. గుర్గావ్ లోని ఐబీఎం కంపెనీలో టెక్కీగా పని చేస్తున్న యువతిని ఈయన పరిచయం చేసుకున్నాడు.

తరువాత యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. గుజరాత్ లో ఇంకా మంచి ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పాడు. తరువాత ఢిల్లీలోని ఫైవ్ స్టార్ హోటల్ కు పిలుచుకుని వెళ్లి తన మీద అత్యాచారం చేశాడని యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇప్పుడు తనను వివాహం చేసుకోనని బెదిరిస్తున్నాడని, ఇప్పటికే ఆయన మరో మహిళా ప్రొఫెసర్ ను పెళ్లి చేసుకున్నాడని, వారికి పిల్లలు ఉన్నారని బాధితురాలు పోలీసులకు సమాచారం ఇచ్చింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ప్రొఫెసర్ మీద కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications