లంచం తీసుకొని లైంగిక వేధింపులు, ఉద్యోగిని చితక్కొట్టిన మహిళ (వీడియో)
మూడేళ్ళుగా తన పనిచేస్తానంటూ లంచం తీసుకోవడంతో పాటు లైంగికంగా వేధించిన ఓ ప్రభుత్వ అధికారికి బాధిత మహిళ తగిన బుద్దిచెప్పింది. ఈ ఘటన బీహర్ రాష్ట్రంలో చోటుచేసుకొంది.
పాట్నా:మూడేళ్ళుగా తన పనిచేస్తానంటూ లంచం తీసుకోవడంతో పాటు లైంగికంగా వేధించిన ఓ ప్రభుత్వ అధికారికి బాధిత మహిళ తగిన బుద్దిచెప్పింది. ఈ ఘటన బీహర్ రాష్ట్రంలో చోటుచేసుకొంది.
బీహర్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్ జిల్లా గైఘాట్ బ్లాక్ లో సంచలనం రేపింది ఈ ఘటన,.గైఘాట్ బ్లాక్ సర్కిల్ ఆఫీసర్ గా పనిచేస్తోన్న నిషికాంత్ అనే అధికారి తన పనిచేసేందుకుగాను లంచం తీసుకోవడమే కాకుండా తనను లైంగికంగా వేధిస్తున్నాడని బాధిత మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఓ మహిళ కార్యాలయానికి వచ్చి నిషికాంత్ కాలర్ పట్టుకొని బయటకు తీసుకువచ్చింది. లంచం తీసుకొని లైంగికంగా వేధిస్తావా అంటూ ప్రశ్నిస్తూ నిషికాంత్ రెండు చెంపలు వాయించింది. తోటి ఉద్యోగులు స్తానికులు కొందరు అడ్డుకోబోయినా వారిని నెట్టివేసింది.
కీచక అధికారికి గట్టిగానే బుద్దిచెప్పింది. ఈ ఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.












Click it and Unblock the Notifications