అత్యాచారానికి సహకరించలేదని 4వ, అంతస్థు నుండి తోసేశాడు
అత్యాచారానికి సహకరించలేదనే కక్షతో 20 ఏళ్ళ యువతిని నాలుగో అంతస్థు నుండి కిందికి తోసేశాడు ఓ దుర్మార్గుడు. ఈ ఘటన న్యూడిల్లీలో చోటుచేసుకొంది. ఆ యువతి పరిస్థితి సీరియస్‌గా ఉందని వైద్యులు చెప్పారు.
న్యూఢిల్లీ: అత్యాచారానికి సహకరించలేదనే కక్షతో 20 ఏళ్ళ యువతిని నాలుగో అంతస్థు నుండి కిందికి తోసేశాడు ఓ దుర్మార్గుడు. ఈ ఘటన న్యూడిల్లీలో చోటుచేసుకొంది. ఆ యువతి పరిస్థితి సీరియస్‌గా ఉందని వైద్యులు చెప్పారు.
దేశ రాజధాని ఢిల్లీలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో అసిస్టెంట్ చెఫ్‌గా బాధితురాలు పనిచేస్తోంది.తన స్నేహితురాలు మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమె బయటకు వెళ్ళింది.

తిరిగి వచ్చే సమయంలో నిందితుడితో కలిసి ఆమె ఉంది. అయితే ఒంటరిగా ఉన్న బాధితురాలిపై నిందితుడు అత్యాచారానికి ప్రయత్నించాడు. అయితే ఆమె నిరాకరించింది.
దీంతో కక్ష పెంచుకొన్న ఆ యువకుడు బాధితురాలిని నాలుగో అంతస్థు నుండి కిందకు తోసేశాడు. ఆ సమయంలో ఆ ఒంటిపై వస్త్రాలు సరిగా లేవని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై అత్యాచారం, హత్యయత్నం కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications