ప్రియుడిపై యాసిడ్ దాడి కేసులో ట్విస్ట్.. చేసింది ప్రియురాలే.. ఎందుకంటే?
ఢిల్లీ : వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. మూడేళ్ల పాటు చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ప్రియురాలు పెళ్లి చేసుకుందామనేసరికి ప్రియుడు మాట మార్చాడు. ఆమెకు బ్రేకప్ చెప్పాడు. అది భరించలేని యువతి ప్రియుడిపై పగ పెంచుకుంది. పక్కా ప్లాన్‌తో యసిడ్ దాడి చేసి ప్రతీకారం తీర్చుకుంది. పోలీసుల దర్యాప్తులో నిజం బయటపడటంతో ప్రస్తుతం శ్రీకృష్ణ జన్మస్థానానికి చేరింది.

యువకుడిపై యాసిడ్ దాడి
2019 జూన్ 11. ఢిల్లీ వికాస్‌పురిలో ఏరియా. ఓ బైక్‌పై యువతీ యువకుడు దూసుకుపోతున్నారు. ఇంతలో బైక్ నడుపుతున్న యువకుడితో పాటు యువతి హాహాకారాలు చేస్తూ బైక్‌పై నుంచి పడిపోయారు. అక్కడికి చేరుకున్న స్థానికులు వారిని దగ్గరలోని హాస్పిటల్‌కు తరలించారు. పరిశీలించిన వైద్యులు యాసిడ్ దాడి జరిగినట్లు గుర్తించారు. యాసిడ్ దాడిలో యువకుడి ముఖం, మెడ, ఛాతీ భాగంలో యువతికి చేతులపై కాలిన గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

తీగలాగితే కదిలిన డొంక
రోజులు గడుస్తున్నా యాసిడ్ దాడి ఎవరు చేశారన్న విషయంలో పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. దర్యాప్తులో భాగంగా గాయపడిన వ్యక్తిని విచారించడంతో చిన్న క్లూ దొరికింది. బైక్‌పై వెళ్తున్న సమయంలో వెనక సీట్‌లో కూర్చున్న అతని ప్రియురాలు హెల్మెట్ తీయమని కోరడంతో తాను తీశానని యువకుడు చెప్పాడు. ఈ మాట ఆధారంగా పోలీసులు తీగ లాగడంతో డొంక కదిలింది. సదరు యువతిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది.

ప్రియురాలి అరెస్ట్
యాసిడ్ దాడిలో గాయపడిన ఇద్దరు యువతీయువకులు ప్రేమికులని పోలీసు విచారణలో తేలింది. మూడేళ్లుగా వారిద్దరూ ప్రేమలో ఉన్నారు. ప్రియురాలుప పెళ్లి చేసుకుందామనే సరికి అబ్బాయి లవ్ స్టోరీకి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశాడు.దీంతో అతనిపై కోపం పెంచుకున్న యువతి మాస్టర్ ప్లాన్ వేసింది. జూన్ 11న దాన్ని అమలు చేసింది. ప్రియుడితో పాటు బైక్‌పై వెళ్తూ హ్యాండ్ బ్యాగ్‌లో దాచుకున్న యాసిడ్ బాటిల్ తీసి అతనిపై పోసింది. దీంతో ప్రియుడికి తీవ్ర గాయాలుకాగా.. ఆమె స్వల్పంగా గాయపడింది. నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications