దారుణం : డబ్బు చెల్లించలేదని మహిళను స్తంభానికి కట్టి.. (వీడియో)

Recommended Video

    డబ్బు చెల్లించలేదని మహిళను స్తంభానికి కట్టి

    బెంగళూరు : కర్నాటకలో సభ్య సమాజం తలదించుకునే ఘటన జరిగింది. అప్పు తిరిగి చెల్లించలేదన్న కారణంతో కొందరు వ్యక్తులు ఓ మహిళను దారుణంగా హింసించారు. స్తంభానికి కట్టేసి చిత్రహింసలు పెట్టారు. అటుగా వెళ్తున్న వారు ఆ దారుణాన్ని ఆపకపోగా.. చెప్పులు, చీపురుతో కొట్టండని చెప్పడం గమనార్హం.

    చామరాజనగర్‌ జిల్లా కొల్లేగల్‌కు చెందిన రాజమని పొట్ట కూటి కోసం హోటల్ నడుపుతోంది. పనిలో పనిగా బెంగళూరులో చిట్‌ఫండ్ వ్యాపారం చేస్తోంది. చీటీకి సంబంధించి కొందరు వ్యక్తులకు రూ.50వేలు బాకీ పడిన ఆమె ఆ మొత్తం చెల్లించడంలో విఫలమైంది. దీంతో ఆగ్రహించిన సదరు వ్యక్తులు కొడిగెహెళ్లిలో ఆమెను స్తంభానికి కట్టేశారు. డబ్బు తిరిగి చెల్లించాలంటూ చిత్రహింసలు పెట్టారు.

    Woman Tied To Pole For Not Repaying Loan

    మహిళను స్తంభానికి కట్టేసి హింసించిన ఘటనను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో అది వైరల్ అయింది. విషయం తమ దృష్టికి రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనతో సంబంధమున్న ఏడుగురిని అరెస్ట్ చేశారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+