దుస్తులు మార్చుకుంటుండగా ఫొటోలు తీసి.. ఆపై బ్లాక్ మెయిల్ చేసి..

Posted By:
Subscribe to Oneindia Telugu

కొచ్చి: మైనర్ బాలికలపై లైంగిక అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా కేరళలో ఓ బాలిక (13) దీని బారిన పడింది. ఈ లైంగిక వేధింపులకు పాల్పడింది కూడా మహిళే. మహిళ అయి ఉండి కూడా ఆ బాలికను లైంగికంగా వేధించి ఈమె తన వికృత బుద్ధిని చాటుకుంది.

కొచ్చిలోని పల్లురుథీలో ఈ ఘటన చోటు చేసుకుంది. కీచకంగా ప్రవర్తించిన నిందితురాలిని పోలీసులు అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరచగా.. కోర్టు ఆమెకు పోలీసు కస్టడీ విధించింది. అసలేం జరిగిందంటే..

Woman 'turns' man to sexually abuse minor girl in Kochi...

సదరు మైనర్ బాలిక దుస్తులు మార్చుకుంటుండగా.. ఈ మహిళ ఫొటోలు తీసింది. తరువాత ఆ ఫొటోలను ఫేస్ బుక్ ద్వారా బహిరంగ పరుస్తానని బెదిరించి.. అప్పటినుంచి ఆ బాలికతో ఆమె లైంగికంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది.

మొదట ఈ విషయాన్ని చెప్పడానికి భయపడిన బాలిక ఆ తరువాత తన తల్లిదండ్రులకు తెలుపగా వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు బాలికను అశ్లీలంగా ఫొటోలు, వీడియోలు తీసిన ఫోన్ తోపాటు సిమ్ కార్డును స్వాధీనం చేసుకుని సదరు మహిళా కీచకురాలిని అరెస్టు చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Kochi: In the latest of the countless sexual assault cases on children being reported from Kerala, a woman was arrested Friday in Kochi on charges of sexually abusing 1 12-year-old-girl. Sini, aka Chinnavi, 26, of Palluruthy, was arrested by the Palluruthy police after the Childline informed the police that she had abused a minor girl serveral times and in disguise as a man
Please Wait while comments are loading...