దారుణం : బైక్‌పై వెంబడించి మహిళపై కాల్పులు..
ఢిల్లీ : దేశ రాజధాని నగరం ఢిల్లీలో దారుణం జరిగింది. పట్టపగలు అందరూ చూస్తుండగానే నగరం నడిబొడ్డున ఇద్దరు దుండగులు మహిళను కాల్చిచంపారు. రద్దీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. కాల్పుల్లో తీవ్ర గాయాలపాలైన మహిళ ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతోంది.
ఉదయం ఇంట్లోంచి బయలుదేరిన కిరణ్ బాలాను ఇద్దరు గుర్తు తెలియని దుండగులు వెంబడించారు. 8గంటల సమయంలో రాడిసన్ బ్లూ హోటల్ వద్ద కారులో వెళ్తుండగా.. అకస్మాత్తుగా ఆమెపై కాల్పులు జరిపారు. ఆగంతకులు రెండు రౌండ్లు కాల్పులు జరపగా.. అందులో ఒక బుల్లెట్ ఆమె మెడలోకి దూసుకెళ్లింది. దీంతో స్పృహ కోల్పోయిన ఆమెను దగ్గరలోని హాస్పిటల్‌కు తరలించారు.

కాల్పుల ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాల్పుల ఘటన వెనుక దోపిడీ ఉద్దేశం లేదని, కుటుంబ కలహాల కారణంగానే కాల్పులు చోటు చేసుకున్నాయని పోలీసులు చెబుతున్నారు.
Delhi: Police present at the spot where a woman was shot at by unidentified assailants near Dwarka Sector 12, today; woman admitted to a local hospital pic.twitter.com/8eZ4klCBD9
— ANI (@ANI) July 11, 2019
పోలీసులు కాల్పులకు తెగబడిన దుండగుల ఆచూకీ తెలుసుకునే పనిలో పడ్డారు. ఘటనాస్థలంలో సీసీ టీవీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. దాని ఆధారంగా కొందరు అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications