వ్యభిచార వృత్తిలో సంపాదించిందంతా వాళ్ల వద్దే! మోడీని వేడుకుంది..
వ్యభిచార కూపంలో తాను సంపాదించిన డబ్బంతా యజమానుల వద్దే ఉందని, దాంతో పాతనోట్లు రద్దయిపోయినప్పుడు మార్చుకునే అవకాశం లేకుండా పోయిందని లేఖలో వాపోయింది.
పుణె: పెద్ద నోట్ల రద్దు సమయంలో దేశంలోని సామాన్యులంతా తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా వ్యభిచార వృత్తిలో కొనసాగుతున్న వేశ్యలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ఇదే క్రమంలో పుణెలోని ఓ వ్యభిచార కూపంలో చిక్కుకున్న ఒక యువతి.. సహాయం కోసం ప్రధాని మోడీకి అప్పట్లో ఒక లేఖ రాసింది.
వ్యభిచార కూపంలో తాను సంపాదించిన డబ్బంతా యజమానుల వద్దే ఉందని, దాంతో పాతనోట్లు రద్దయిపోయినప్పుడు మార్చుకునే అవకాశం లేకుండా పోయిందని లేఖలో వాపోయింది. దీంతో పుణెకు చెందిన ఓ స్వచ్చంద సంస్థ ఆ యువతికి సహాయం చేసేందుకు ముందుకు వచ్చి ఆశ్రయం కల్పించింది. రూ.10వేల ఆర్థిక సహాయం కూడా అందించింది.

అలాగే ఆమె గురించి తెలుసుకున్న పలువురు వివిధ ప్రాంతాల నుంచి ఆమెకు కొంత డబ్బును పంపించారు. ఆస్ట్రేలియాకు చెందిన ఒక మహిళ కూడా సదరు స్వచ్చంద ద్వారా కొంత మొత్తాన్ని అందజేసినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications