నేనిప్పుడు గర్భవతిని.. పాయింట్ బ్లాక్‌లో గన్ గురిపెట్టి మరీ!, పెళ్లిలో షాకింగ్ ఘటన
పాయింట్ బ్లాక్ లో గన్ గురిపెట్టుకుని వరుడి బాగోతం గురించి చెప్పింది. 'ఇప్పుడు చెప్పు.. నేనిప్పుడు గర్భవతిని, మనిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నది నిజం కాదా?' అంటూ నిలదీసింది.
లక్నో: 'ఆపండి.. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు'.. వరుడు తాళికట్టడానికి సిద్దమవుతున్న తరుణంలో.. తెలుగు సినిమాల్లో వినిపించే డైలాగ్ ఇది. ప్రేమ పేరుతో మోసం చేశాడనో.. అంతకుముందే మరో పెళ్లయిందనో.. ఇలా పీటల మీద పెళ్లిళ్లు ఆగిపోయే సీన్లు మన సినిమాల్లో చాలానే చూసుంటాం.
అచ్చు ఇదే తరహాలో ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ జిల్లాలో ఓ పీటల మీది పెళ్లి ఆగిపోయింది. కారణం.. సరిగ్గా తాళి కట్టే సమయానికి ఓ యువతి గన్ తో పెళ్లి మంటపంలోకి ఎంట్రీ ఇవ్వడమే. ఎంట్రీతోనే ఆగిపోలేదు.. గన్ ను పాయింట్ బ్లాక్ లో తనకు తానే గురిపెట్టుకుని సదరు వరుడి నిర్వాకం గురించి ఏకరువు పెట్టడంతో.. దెబ్బకు పెళ్లి రద్దయిపోయింది.

వివరాల్లోకి వెళ్తే.. న్పూర్ జిల్లా షివ్లికి చెందిన అమ్మాయితో దేవేంద్ర అవస్థి అనే యువకుడికి వివాహం నిశ్చయమైంది. ముందుగా నిర్ణయించిన మేరకు, గురువారం నాడు పెళ్లి ఏర్పాట్లు జరిగిపోయాయి. వేద మంత్రాల నడుమ ఇక తాళి కట్టడమే తరువాయి అనుకుంటున్న తరుణంలో.. ఎక్కడి నుంచి వచ్చిందో గానీ ఒక యువతి గన్ తో ఎంట్రీ ఇచ్చింది.
పాయింట్ బ్లాక్ లో గన్ గురిపెట్టుకుని వరుడి బాగోతం గురించి చెప్పింది. 'ఇప్పుడు చెప్పు.. నేనిప్పుడు గర్భవతిని, మనిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నది నిజం కాదా?' అంటూ నిలదీసింది. దీంతో వరుడు తటాపటాయించడంతో అసలు విషయం బయటపడింది. వరుడి నిర్వాకానికి వధవు కుటుంబం వివాహం రద్దు చేసుకుని వెళ్లిపోయింది.
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications