వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్కూల్ వ్యాన్‌లో యువతిపై గ్యాంగ్ రేప్

|
Google Oneindia TeluguNews

అహమ్మదాబాద్: గుజరాత్ లోని రాజ్ కోట్ లో దారుణం జరిగింది. ఇంటిలో ఉన్న యువతిని కిడ్నాప్ చేసిన నిందితులు ఆమె మీద గ్యాంగ్ రేప్ చేసి అడ్డంగా బుక్కయ్యారు. ఇద్దరు కామాంధులకు వైద్య పరీక్షలు నిర్వహించి విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

అమిత్ అహిర్, భావేష్ బర్వాడ్ అనే ఇద్దరు యువకులును అరెస్టు చేశామని బుధవారం పోలీసులు చెప్పారు. భావేష్ ఓ స్కూల్ లో వ్యాన్ డ్రైవర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. రాజ్ కోట్ ప్రాంతంలో 22 సంవత్సరాల యువతి నివాసం ఉంటున్నది.

యువతి మేన కోడలు భావేష్ పని చేస్తున్న స్కూల్ లో చదువుతున్నది. మేన కోడలను పిలుచుకు రావడానికి యువతి స్కూల్ దగ్గరకు వెళుతుండేది. ఆ సమయంలో భావేష్ ఆమె మీద కన్ను వేశాడు.

 Women allegedly abducted and raped inside Moving Van

ఈ నెల 3వ తేదీ రాత్రి ఇంటిలో ఉన్న యువతిని అమిత్ అహిర్, భావేష్ స్కూల్ వ్యాన్ లో కిడ్నాప్ చేసి తీసుకు వెళ్లారు. కదులుతున్న వ్యాన్ లోనే ఒకరి తరువాత ఒకరు ఆమె మీద అత్యాచారం చేశారు. తరువాత యువతిని వ్యాన్ నుంచి కిందకు నెట్టి అక్కడి నుంచి పరారైనారు.

బాధితురాలికి గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పోందుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి యువతి తెలిపిన వివరాల ఆధారంగా కామాంధులను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

English summary
Two people have been arrested for allegedly abducting and raping a 22-year-old woman in a moving van in Rajkot.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X