బట్టలు లేకున్నా మహిళలు బాగుంటారు: ఆ బాబా హాట్ కామెంట్స్

ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా తన వ్యాఖ్యలతో ప్రస్తుతం మరోమారు చిక్కుల్లో పడ్డారు. మహిళల వస్త్రధారణ గురించి రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనను మరోమారు ఇరకాటంలోకి నెట్టాయి. ఈ మధ్య కాలంలో ఆయన వివాదాలకు కేరాఫ్ గా మారారు.

వివాదాలకు కేరాఫ్ రాం దేవ్ బాబా

వివాదాలకు కేరాఫ్ రాం దేవ్ బాబా

గతంలో బాలీవుడ్ ఇండస్ట్రీ పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ అగ్ర నటులు డ్రగ్స్ సేవిస్తున్నారు అంటూ రాందేవ్ బాబా చేసిన సంచలన ఆరోపణలు సినీ వర్గాల లోనే కాకుండా సామాన్య ప్రజల్లో చర్చనీయాంశం కాగా ఇక రాజకీయాల్లో కూడా డ్రగ్స్ వినియోగం ఉందంటూ రాందేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు చేసి దుమారం రేపారు. ఇక ప్రస్తుతం మహిళల వస్త్రధారణపై తాజాగా రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు మహిళలలో తీవ్ర ఆగ్రహానికి కారణం అవుతున్నాయి. ఇంతకు రాందేవ్ బాబా ఏమన్నారంటే..

మహిళల యోగ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న రాందేవ్ బాబా

మహిళల యోగ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న రాందేవ్ బాబా

మహారాష్ట్ర థానే లోని పతంజలి యోగ పీఠం, అలాగే ముంబై మహిళల పతంజలి యోగ సమితి సంయుక్తంగా యోగా సైన్సు శిబిరాన్ని నిర్వహించాయి. ఇక ఈ శిబిరంలో పాల్గొన్న రామ్ దేవ్ బాబా షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఈ శిబిరానికి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ కూడా హాజరయ్యారు. ఈ యోగా శిబిరానికి వచ్చిన మహిళలు అందరూ యోగ డ్రెస్సులలో వచ్చారు. ఆపై మహిళలకు ఏర్పాటుచేసిన యోగ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆ తర్వాత ఒక ప్రత్యేక సమావేశం జరిగింది.

మహిళలు ఏం ధరించకున్నా బాగుంటారని వ్యాఖ్యలు

అయితే వెంట వెంటనే ఇలా కార్యక్రమాలు జరగడంతో మహిళలకు చీరలు ధరించే సమయం దొరకలేదు. ఈ పరిస్థితి పై మాట్లాడిన రాందేవ్ బాబా షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. మహిళలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన మీకు చీరలు ధరించేందుకు టైం లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడైనా ఇంటికి వెళ్లి చీరలు ధరించి రావచ్చు అని పేర్కొన్నారు. మహిళలు చీరలలో, సల్వార్ సూట్ లలో బాగుంటారని పేర్కొన్న రాందేవ్ బాబా తనకు అయితే మహిళలు ఏం ధరించకపోయినా బాగుంటారు అంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.

 మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి

అమృతా ఫడ్నవీస్ ముందే రాందేవ్ బాబా వ్యాఖ్యలు
ఈ శిబిరానికి వచ్చిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ ముందే రాందేవ్ బాబా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం గా మారాయి. బట్టలు లేకున్నా ఆడవాళ్లు అందంగా తనకు కనిపిస్తారని రాందేవ్ బాబా మాట్లాడటంపై ఆగ్రహజ్వాలలు వెల్లువగా మారుతున్నాయి. .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+