నైట్ క్లబ్ యువతులపై కీచకపర్వం: చెప్పులతో ఎదురు దాడి, సెక్స్ డీల్స్ ! (వీడియో) !

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ శివార్లోని గురుగ్రామ్ ప్రాంతంలో నిత్యం రద్దీగా ఉండే మహాత్మాగాంధీ రోడ్డు (ఎంజీ రోడ్డు)లో కీచకపర్వం చోటుచేసుకోంది. అందరూ చూస్తున్న సమయంలో నైట్ క్లబ్ లో ఉద్యోగం చేస్తున్న ఓ యువతిని అల్లరిమూకలు ఎత్తుకెళ్లడానికి విఫలయత్నం చేశారు.

కుమార్తెను కుర్చీలో కట్టేసి పక్కింటి ఆంటీని రేప్ చేశాడు, చివరికి కామాంధుడు !

అయితే అక్కడ ఉన్న యువతులు సివంగుల్లా గర్జించడంతో అల్లరిమూకలు తోకలుముడిచారు. చేతుల్లోకి చెప్పులు తీసుకుని అల్లరిమూకల మీద ఎదురుదాడికి దిగారు. ప్రతిదాడి జరగడంతో కీచకులు అక్కడి నుంచి కాలికి బుద్ది చెప్పారు. నైట్ క్లబ్ లో ఉద్యోగం చేస్తున్న యువతులు కీచకులకు బుద్ది చెబుతున్న దృశ్యాలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఎంజీ రోడ్డులో నైట్ క్లబ్

గురుగ్రామ్ లోని ఎంజీ రోడ్డులోని ఓ నైట్ క్లబ్ లో ఉద్యోగం చేస్తున్న యువతులు శనివారం అర్దరాత్రి 1.30 గంటల సమయంలో విధులు ముగించుకుని ఇంటికి వెళ్లడానికి బయటకు వచ్చారు. రోడ్డు పక్కన క్యాబ్ కోసం యువతులు వేచి ఉన్నారు.

యువకులు చుట్టుముట్టి !

యువకులు చుట్టుముట్టి !

అదే సమయంలో నలుగురు యువకులు అక్కడికి చేరుకుని యువతులను చుట్టుముట్టారు. వస్తావా ? నీ రేటు ఎంత ? ఎమైనా ఇస్తావా ? అంటూ అసభ్యంగా మాట్లాడారు. కొంత సేపు సహనంగా ఉన్న యువతులు మర్యాదగా ఉండదంటూ పోకిరీలను తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

అమ్మాయిని ఎత్తుకెళ్లాలని !

అమ్మాయిని ఎత్తుకెళ్లాలని !

అక్కడి నుంచి వెళ్లిపోయిన పోకిరీలు రెండు నిమిషాల్లో సుమారు 10 మందిని వెంటపెట్టుకుని మళ్లీ అక్కడికే వచ్చారు. అప్పటికి క్యాబ్ రాకపోవడంతో నైట్ క్లబ్ లో ఉద్యోగం చేసే యువతులు అక్కడే ఉన్నారు. రెచ్చిపోయిన యువకులు ఓ అమ్మాయిని ఎత్తుకెళ్లడానికి విఫలయత్నం చేశారు.

చెప్పులు తెగిపోయాయి !

చెప్పులు తెగిపోయాయి !

అంత వరకు ఎంతో ఓపికగా ఉన్న యువతులు సివంగుల్లా రెచ్చిపోయారు. చెప్పులు చేతిలో పట్టుకుని కీచకులపై దాడి చేశారు. చెప్పులు తెగిపోయే వరకు వారి మీద ఎదురు దాడి చెయ్యడతో అక్కడి నంచి తోకముడిచారు. ఈ తంతంగం అర్దగంట పాటు జరిగింది.

నో పోలీస్, వీడియోలు తీశారు !

నో పోలీస్, వీడియోలు తీశారు !

నైట్ క్లబ్ యువతుల పట్ల అర్దగంట పాటు అక్కడ కీచకపర్వం జరిగినా ఎవ్వరూ కాని ఆ కామాంధులను అడ్డుకోవడానికి ప్రయత్నించలేదు. పోలీసులు జాడా కనిపించలేదు. కొందరు మాత్రం ఆ దృశ్యాలను మొబైల్ లో చిత్రీకరించి ఓ జాతీయ మీడియా సంస్థకు పంపించి తరువాత సోషల్ మీడియాలో పెట్టారు.

సెక్స్ డీల్స్, డ్రగ్స్ ముఠాలు !

సెక్స్ డీల్స్, డ్రగ్స్ ముఠాలు !

గురుగ్రామ్ లోని ఎంజీరోడ్డులో కీచకపర్వం జరిగిన సమయంలో అక్కడే ఉన్న ప్రత్యక్షసాక్షి లాల్ అనే వ్యక్తి ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. ఎంజీ రోడ్డులో నిత్యం డ్రగ్స్, సెక్స్ డీల్స్ భారీ ఎత్తున జరుగుతోందనే విషయం ఓపెన్ సీక్రెట్ అని బాంబు పేల్చాడు.

15 నైట్ క్లబ్ లు, యువతులే !

15 నైట్ క్లబ్ లు, యువతులే !

ఎంజీ రోడ్డులో మొత్తం 15కు పైగా నైట్ క్లబ్ లు ఉన్నాయని లాల్ చెబుతున్నాడు. అక్కడున్న నైట్ క్లబ్ లో దాదాపు అందరూ మహిళలు యువతులే ఉద్యోగం చేస్తున్నారని అన్నారు, యువతులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు మాత్రం పెద్దగా పట్టించుకున్న పాపానపోలేదని లాల్ ఆరోపిస్తున్నాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A video showing a group of women bashing a man who allegedly tried to molest one of them has gone viral on social media.
Please Wait while comments are loading...