ప్రాణంతీసిన మాత్రలు..!! విగతజీవిగా మారిన యువతి.. ఎందుకో తెలుసా..!!!

లక్నో : మాట కలిపాడు.. లైన్‌లో పెట్టాడు. ఇంకేముంది సమయం చూసి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఒకసారి రేప్ చేయలేదు.. పలుమార్లు తెగబడ్డాడు. ఇంకేముంది ఆ యువతి గర్భం దాల్చింది. దీంతో ఆ యువకుడి నైజం బయటపడింది. అబార్షన్ చేయించుకోవాలని కోరాగ .. నిరాకరించింది. ఎలాగైన గర్భస్రావం చేయించాలనుకుని .. చివరికి యువతినే మట్టుబెట్టేస్థితికి చేరాడు.

అపస్మారకస్థితిలోకి ..
యూపీలోని కనౌజ్ జిల్లాలో దారుణం జరిగింది. కొత్వాలి పోలీసుస్టేషన్ పరిధిలో ఓ యువతి, యువకుడు నివసిస్తున్నారు. అయితే యువతితో మాట కలిపాడు. ఫ్రెండ్‌షిప్ చేశాడు. తర్వాత లైంగికదాడికి పాల్పడ్డాడు. ఒకసారి కాదు పలుమార్లు రేప్ చేయడంతో ఆమె గర్భం దాల్చింది. విషయం అతనికి తెలియడంతో చమటలు పట్టాయి. ఏం చేద్దాం అని ఆలోచించారు. అబార్షన్ చేయించుకోవాలని కోరడంతో ఆమె నిరాకరించింది. దీంతో అతని ప్రాణం పోయినట్లైంది.

women dead take few of abortion tablets..

బలవంతంగా ...
ఏం చేద్దామని సుదీర్ఘంగా ఆలోచించాడు. బయటకు వెళ్థామని చెప్పడంతో .. నమ్మి వెళ్లింది. కమల్‌గంజ్ తీసుకెళ్లాడు. అక్కడ ఆమెకు బలవంతంగా అబార్షన్ మాత్రలు మింగించాడు. అయితే కొద్దిసేపట్లోనే ఆమె స్పృహ తప్పిపోయింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను దవాఖానకు తీసుకెళ్లాల్సింది పోయి .. అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. కమల్‌గంజ్ క్రాస్ రోడ్డు వద్ద యువతిని చూసి ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అప్పటికే ఆలస్యమైంది. యువతిని ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. హాస్పిటల్‌లో యువతి చనిపోయింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు చెప్తున్నారు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేశామని పోలీసులు తెలిపారు. నిందితుడి కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+