Religion: మీరు హిందువులు కదా, క్రిస్మస్ కోసం ఎందుకు ప్రార్థనలు ?, మా ఇష్టం వచ్చినట్లు ఉంటాము !

బెంగళూరు/తుమకూరు: బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మతమార్పిడి చెయ్యడాన్ని వ్యతిరేకిస్తున్న నాయకులు లక్షల సంఖ్యలో ఉన్నారు. మతమార్పిడి చెయ్యడం నేరం అని కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే కొత్త చట్టాలు అమలు చేశాయి. మతమార్పిడి చేస్తూ భారతదేశంలో హిందువులను అంతం చెయ్యడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని కొన్ని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

క్రిస్మస్ పండుగ సందర్బంగా కర్ణాటకలోని తమకూరు జిల్లాలోని కుణిగల్ లో ఓ కుటుంబ సభ్యులు వారి ఇంటిలో బంధువుల సమక్షంలో ప్రార్థనలు చేస్తున్నారు. ఆ విషయంలో కొందరు బంధువులు వ్యతిరేకించారు. క్రిస్మస్ పండుగ సందర్బంగా ప్రార్థనలు చేస్తున్న కుటుంబ సభ్యులు వారి బంధువులు కొందరిని పండుగకు ఆహ్వానించారు. ప్రార్థనలు చేస్తున్న సమయంలలో హిందూ సంఘాలకు చెందిన కొందరు నాయకులు, కార్యకర్తలు ఆ ఇంటికి వెళ్లారు.

Women fight off Hindutva vigilantes who disrupted Christmas celebrations in Kunigal near Tumakuru in Karnataka.

ఆ సమయంలో అక్కడ రచ్చ రచ్చ జరిగింది. హిందువులు అయిన మీరు ఎందుకు నుదుటి మీద బొట్టు పెట్టుకోలేదు ?. దేవుడికి పూజ చెయ్యకుండా ఎందుకు ఏసుప్రభువు ను ప్రార్థిస్తున్నారు ? అంటూ ప్రశ్నించారు. మేము మా ఇంటిలో ప్రార్థనలు చేసుకుంటుంటే మీకు వచ్చిన అభ్యంతరం ఏమిటి అని ఆ కుటుంబ సభ్యులు హిందూ సంఘాల నాయకులను ప్రశ్నించారు.

మా ఇంట్లో హిందూ దేవుళ్లు కూడా ఉన్నారని, అయినా మాకు క్రిస్మస్ రోజు ప్రార్థనలు చెయ్యాలని అనిపించిందని ఆ ఇంట్లోని మహిళలు హిందూ సంఘాల నాయకులతో గొడవకు దిగారు. మాకు ఎవరిని పూజించాలని అనిపిస్తే వారినే పూజిస్తామని, మీరు మాకు నీతులు చెప్పనవసరం లేదని ఆ ఇంట్లోని మహిళలు, కుటుంబ సభ్యులు హిందూ సంఘాల నాయకులతో గొడవకు దిగారు.

ఆ సమయంలో తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు ఉంటారని కొందరు అంటున్నారు. హిందువులను నాశనం చెయ్యడానికి కొందరు కావాలని మతమార్పిుడులు చేస్తున్నారని, దేశంలో చాలా చోట్లు ఇదే జరుగుతోదని కొందరు సోషల్ మీడియాలో ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+