viral video: సినిమా టికెట్ల కోసం పొట్టుపొట్టు కొట్టుకున్న మహిళలు..
ఇటీవలికాలంలో మల్టీ ప్లెక్స్ ల ప్రభావం భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో సింగిల్ స్క్రీన్ థియేటర్లకు జనాలు రావడమే మానేశారు. ముఖ్యంగా కన్నడ సినిమాలను సింగిల్ థియేటర్లలో చూడ్డమే మర్చిపోయారు. సినిమా చిన్నదైనా.. పెద్దదైనా మల్టీప్లెక్స్ ల్లో చూసేందుకే ఇప్పటి యువత ఆసక్తి చూపిస్తున్నారు.
అయితే ఇటీవల కర్ణాటకలో రిలీజ్ అయిన "ప్రేమద ఊరళి" అనే చిత్రం మాత్రం కన్నడ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఇన్నాళ్లూ ప్రేక్షకులు లేక వెలవెలబోయిన కన్నడ సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఈ మూవీ కొత్త జోష్ ను తీసుకొచ్చిందని చెప్పాలి. ఇప్పుడు ఈ థియేటర్లలో ప్రేమద ఊరళి సినిమా టికెట్ కోసం మహిళలు కొట్లాడుకునే పరిస్థితి ఎదురైందంటేనే అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే హవేరీలోని మగావి సినిమా థియేటర్ లో షాకింగ్ ఘటన జరిగింది.

మగావి థియేటర్ లో ప్రేమద ఊరళి టికెట్ల కోసం మహిళలు తమ భర్తలతో కలిసి క్యూ లైన్ లో నిల్చున్నారు. ఆ సమయంలో లైన్ లో ఏర్పడిన ఓ చిన్న వివాదం సడెన్ గా పెద్ద గొడవకు దారితీసింది. మాటామాటా పెరిగి మహిళలు ఒకరి జుట్టు ఒకరు పట్టుకుని తీవ్రంగా కొట్టుకున్నారు. ఈ క్రమంలో ఓ మహిళకు సంబంధించిన మంగళసూత్రం కూడా తెగిపోయి కిందపడింది. తీవ్రంగా గొడవ పడిన అనంతరం సినిమా చూడకుండానే తమ తమ ఊళ్లకు వెళ్లిపోయారు వాళ్లు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక ప్రేమద ఊరళి మూవీకి మనోజ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో శ్రీ రామ్, తపస్విని పూనాచా, రమికా శివ, రంగయాన రఘు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీని కేవలం రూ. 2 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. అయితే ఈ సినిమా కన్నడ ప్రేక్షకుల మనసులను దోచుకుంటోంది. కేవలం మౌత్ టాక్ తోనే ఈ మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఎలాంటి పెద్ద హీరోలు, భారీ వీఎఫ్ఎక్స్ లు, వేల కోట్ల బడ్జెట్ లు లేకుండానే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది.












Click it and Unblock the Notifications
