లేడి రిపోర్టర్స్: రోజుకు 90 మిస్డ్ కాల్స్‌తో చెలగాటం
లక్నో: మహిళా రిపోర్టర్ల ఫోన్ నెంబర్లు సేకరించిన అకతాయి వారి జీవితాలతో చెలగాటం అడుకుంటున్నాడు. ఎప్పుడు పడితే అప్పుడు వారికి ఫోన్లు చెయ్యడం, మిస్డ్ కాల్స్ ఇవ్వడం తదితర చేష్టలు చేస్తూ వారికి నిద్రలేకుండా చేస్తున్నాడు.
ఇతగాడి కోసం ఇప్పుడు ఉత్తరప్రదేశ్, న్యూఢిల్లీ పోలీసులు గాలిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లోని బందా జిల్లాలో పూర్తిగా మహిళలే నడిపించే పత్రిక ‘ఖబర్ లహరియా'లోని సిబ్బంది వేధింపులకు గురైనారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఐదుగురు మహిళా రిపోర్టర్లను వేధిస్తున్నాడు.
అతని పేరు నిషు అని ఖబర్ లహరియా పత్రిక ఎడిటర్ కవిత అంటున్నారు. గత జనవరి నెల నుంచి ఇతను ఆ పత్రికలో పని చేస్తున్న ఐదుగురు మహిళా రిపోర్టర్ల ఫోన్ నెంబర్లు సేకరించాడు. రోజుకు 70 నుంచి 90 మిస్డ్ కాల్స్ ఇచ్చాడు.

అర్దరాత్రి 2 గంటల వరకు ఫోన్లు చేసి వేధించేవాడు. అతను నిత్యం వేర్వేరు నెంబర్ల నుంచి పోన్లు చేస్తున్నాడని కవిత ఆరోపించారు. మొదట తాము పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పెద్దగా పట్టించుకోలేదని కవిత అంటున్నారు.
ఇప్పడు వేధింపులు తారాస్థాయికి చేరాయని, అర్దరాత్రి ఫోన్లు చేసి బూతులు తిడుతున్నాడని, అసభ్యంగా మాట్లాడుతున్నాడని ఆమె ఆరోపించారు. పోలీసు అధికారులు కేసు నమోదు చేసి నిషు కోసం గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications