జల్లికట్టు ఆర్డినెన్సుపై అనుమానాలు, కదిలే ప్రసక్తే లేదు, లక్ష మంది !
చెన్నై: జల్లికట్టుకు ఆమోదం తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్సు జారీ చేసినా చెన్నైలోని మెరీనా బీచ్ లో నిరసనకారులు వెనక్కి తగ్గలేదు. వాస్తవానికి జల్లికట్టు ఆర్డినెన్సు మీద చాల మందికి అనేక అనుమానాలు ఉన్నాయి.
భారీ ఎత్తున వెల్లువెత్తిన నిరసన జ్వాలలను చల్లార్చేందుకు మాత్రమే ఏదో కంటితుడుపు చర్యగా ఈ ఆర్డినెన్సు జారీ చేసి ఉంటారని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆర్డినెన్సు తమకు చూపించాలని పట్టుబడుతున్నారు.
అంతేకాకుండా రాష్ట్రంలో జల్లికట్టు నిర్వహించాలని, ఆ తరువాత తాము ఇక్కడి నుంచి కదిలి వెళ్తామని మొరీనా బీచ్ లో గత ఐదు రోజుల నుంచి నిరసన తెలియజేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులు చెబుతున్నారు. పలువురు మహిళలు నిరసన తెలియజేస్తున్న వారికి మద్దతు ఇస్తూ ఇంటి నుంచి తీసుకు వచ్చిన అన్నం ముద్ద కలిపి స్వయంగా వారే అక్కడ ఉన్న యువకులకు తినిపిస్తున్నారు.

ఇది ఇలా ఉంటే శనివారం తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా డీఎంకే పార్టీ ఆధ్వర్యంలో జల్లికట్టుకు మద్దుతుగా నిరాహార దీక్షలు ప్రారంభం అయ్యాయి. ఈ నిరాహార దీక్షలో డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్, కరుణానిధి కుమార్తె, డీఎంకే పార్టీ ఎంపీ కనిమొళి, ఆ పార్టీ సీనియర్ నాయకుడు దురై స్వయంగా నిరాహార దీక్షలో పాల్గొని జల్లికట్టు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications