Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఒకటి కాదు.. రెండు కాదు 20వ సారి గర్భం.. పదుల సంఖ్యలో పిల్లలు...

ముంబై : అవును మీరు చదివింది నిజమే. ఓ మహిళ 20వ సారి గర్భం దాల్చింది. ఎక్కడో కాదు మన పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలో జరిగింది ఈ ఘటన. ఆమె 20వ సారి గర్భం దాల్చిందని తెలిసి వైద్యులే నోరెళ్లబెట్టారు. అయితే ఇదివరకు జరిగిన ప్రసవాలు అన్నీ .. ఇంటి వద్దే జరగడంతో ప్రపంచానికి ఆమె గత ప్రసవాల గురించి తెలియలేదు. తొలిసారి సీజేరియన్‌కు సిద్ధమవడంతో ... వార్తల్లో నిలిచారు.

20వ సారి గర్భం ..

20వ సారి గర్భం ..

మహారాష్ట్రలోని బీడ్ జిల్లా మజల్‌గావ్ మండలం కేశపురికి చెందిన మహిళ 20వ సారి గర్భం దాల్చింది. గోపాల్ కులానికి చెందిన 38 ఏళ్ల లంకాబాయి ఖరత్ ... మరోసారి గర్భం దాల్చింది. ఇరవై సార్లు గర్భం దాల్చినా ఇదివరకు జరిగినా ప్రసవాలు ఇంట్లోనే జరిగాయి. అందుకే ఇన్నీ సార్లు గర్భం దాల్చినా ఆ విషయం ప్రపంచానికి తెలియలేదు. ఇప్పటివరకు 16 సార్లు ప్రసవం జరిగింది. ప్రతి ప్రసవంలో ఒక్కో చిన్నారి జన్మించారు. అయితే ఐదుగురు శిశువులు పుట్టిన కొన్ని గంటలకే చనిపోయారు. దీంతో ఆమెకు 11 మంది పిల్లలు ఉన్నారు. మరో మూడు సార్లు మూడునెలల గర్భం దాల్చిన సమయంలో గర్భస్రావం అయ్యింది.

తల్లీ, బిడ్డ ఓకే ..

తల్లీ, బిడ్డ ఓకే ..

ఇప్పుడు తాజాగా మరోసారి ప్రెగ్నెంట్ అయ్యారు. లంకాబాయి గురించి తెలిసి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. సివిల్ ఆస్పత్రిలో అన్నీ పరీక్షలు చేశారు. ఇప్పటివరకు తల్లీ, గర్భంలో ఉన్న బిడ్డ ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు పేర్కొన్నారు. ఆమెకు మందులు ఇచ్చామని చెప్పారు. లంబాబాయి ప్రస్తుతం 7 నెలల గర్భవతి అని వైద్యులు తెలిపారు. ఎప్పటిలాగానే 9 నెలలో సిజేరియన్ చేస్తామని .. ఒకవేళ ఇబ్బందులు ఉంటే ముందే ఆపరేషన్ నిర్వహిస్తామని చెప్పారు.

సిజేరియన్ సులువేనా ?

సిజేరియన్ సులువేనా ?

లంబాబాయి ప్రసవం సావ్యంగా జరుగుతుందా ? ఆమెకు భవిష్యత్‌లో ఆరోగ్య సమస్యలు వస్తాయా అనే ప్రశ్న తలెత్తుతుంది. శరీరంలో పిండం పెరిగే అవయవం గర్భాశయం కండరం వంటిదని వైద్యులు వివరించారు. ప్రసవం జరిగిన ప్రతిసారీ ఆ కండరం సాగిపోతుందుని చెప్తున్నారు. ఎక్కువసార్లు ప్రెగ్నెంట్ అయిన మహిళల్లో ప్లసెంటా వేరుపడిన తర్వాత గర్భాశయం సంకోచించడం కష్టమవుతుందని పేర్కొన్నారు. వరుస ప్రసవాల వల్ల గర్భ సంచి బలహీనపడటమే కాక అధికస్థాయిలో రక్తంపోయే ముప్పు ఏర్పడుతుందన్నారు. దీనికితోడు ఇదివరకు జరిగిన అబార్షన్లకు సంబంధించి గర్భాశయంలో ఉండిపోయే స్కార్ కణజాలం ప్లసెంటాకు సమస్యలు సృష్టిస్తోందని వివరిస్తున్నారు. దీనికితోడు నెలలు నిండకుండానే ప్రసవమయ్యే సమస్య కూడా పొంచి ఉందని వైద్యులు వెల్లడించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+