బికినీలతో గర్ల్స్‌వద్దు: మంత్రి, సాధ్యంకాదని మరో మంత్రి

పనాజీ: అమ్మాయిలు కురచ దుస్తులతో పబ్‌లకు వెళ్లకూడదన్న గోవా మంత్రి సుదిన్ దవళికర్ మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గోవాలోని సముద్ర తీరాలలోకి యువతులు బికినీ దుస్తులలో రాకుండా నిషేధించాలని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ స్థలాల్లో బికీనిలలో యువతులను అనుమతిస్తున్న కారణంగా ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వారిని అదుపు చేయడం చాలా కష్టంగా ఉందన్నారు.

ఒక్కో సమయంలో ఎవరైనా బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడంలో ఆలస్యమవుతోందని చెప్పారు. అందుకే సముద్రతీరాల్లోకి యువతులు బికీని దుస్తులలో రాకుండా నిషేధం విధించాలని ఆయన అన్నారు. దీనిపై ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కూడా సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు.

Women should not wear bikinis on public beaches: Goa Minister

కాగా, అమ్మాయిలు షార్ట్ డ్రెస్సులతో పబ్‌లకు వెళ్లడాన్ని గోవా మంత్రి సుదిన్ దవళికర్ వ్యతిరేకించిన విషయం తెలిసిందే. యువతులు చిన్న చిన్న డ్రెస్‌లతో పబ్స్‌కు వెళ్లడం మన సంస్కృతికి విరుద్ధమని ఆయన అన్నారు. అలాంటి అలవాట్లకు యువతులు స్వస్తి చెప్పాలని పిలుపునిచ్చారు. ఇది ఇలాగే కొనసాగితే మన సంస్కృతి ఏం కానుందని ఆవేదన వ్యక్తం చేశారు.

చిన్న దుస్తులతో యువతులు పబ్‌కు వెళ్లడం ద్వారా మన సంస్కృతికి తప్పుడు బీజాలు వేసిన వాళ్లు అవుతున్నారన్నారు. దీనిని ఆపేయవల్సి ఉందని అభిప్రాయపడ్డారు. రెచ్చగొట్టేలా దుస్తులు వేసుకుని పబ్బులకెళ్ళడం సరికాదన్నారు. ముతాలిక్ చెప్పిన దాంట్లో తప్పు లేదన్నారు. ముతాలిక్ ఏ మతానికి వ్యతిరేకంగా మాట్లాడలేదని చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా మాట్లాడే స్వేచ్ఛ ఉందన్నారు.

నిషేధించలేం: దిలీప్

బీచ్‌లలో బికినీలు, మినీ స్కర్టులు ధరించకుండా నిషేధం విధించలేమని మరో మంత్రి దిలీప్ పారులేకర్ స్పష్టం చేశారు. గోవా రాజధాని పనాజీలో ఆయన మాట్లాడుతూ.. మహిళల వస్త్రధారణపై నియంత్రణ పెట్టడం సాధ్యం కాదన్నారు. సుదీన్ ధావలికర్ వ్యాఖ్యల పైన ఆయన స్పందించారు. కాగా, సుదీన్ వ్యాఖ్యలపై గోవాలో నిరసనలు రేగాయి. దీంతో ధావలికర్‌ను మంత్రివర్గం నుంచి తొలగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. మహిళలు ఎలాంటి దుస్తులు ధరించాలో ఉచిత సలహాలు ఇచ్చేబదులు నీటి సమస్యపై దృష్టి సారించాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దుర్గాదాస్ కామత్ అభిప్రాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+