నగ్నంగా చేసి, కారం చల్లి యువతుల విచారణ

ఔరంగాబాద్: యువకుడి ఆకస్మిక మృతి కేసులో అతని స్నేహితులను (యువతులు) తీసుకు వెళ్లి పోలీస్ స్టేషన్ లో అతి దారుణంగా చిత్రహింసలు పెట్టి విచారణ చేసిన సంఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లోని క్రాంతి చౌక్ పోలీస్ స్టేషన్ లో జరిగింది.

క్రాంతి చౌక్ పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న ముగ్గురు పోలీసు అధికారుల మీద విచారణ జరుగుతున్నదని ఔరంగాబాద్ పోలీసు కమిషనర్ అమితేష్ కుమార్ అన్నారు. అమితేష్ కుమార్ కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఓ యువతి (22), ఆమె ఐదు మంది స్నేహితులు నూతన సంవత్సరం వేడుకల సందర్బంగా ఓ హోటల్ కు వెళ్లారు. వారిలో ఇద్దరు యువకులు ఉన్నారు. అక్కడ ఇద్దరు యువతులు తప్పా అందరూ మద్యం సేవించారు. వారిలో ఓ యుకుడు మద్యం మత్తులో పిచ్చిపిచ్చిగా ప్రవర్తించాడు.

Womens disrobed at police station in Aurangabad in Maharashtra

యువతుల మీద పడి నానా హంగామా చేశాడు. అతని వేదింపులు తట్టుకోలేక అర్దరాత్రి 1 గంట సమయంలో పిలుచుకుని వెళ్లి దేవగిరి కాలనీ దగ్గర వదిలి పెట్టారు. తరువాత ఇద్దరు యువతులను వారి ఇంటి దగ్గర వదిలి పెట్టడానికి బయలుదేరారు.

మార్గం మద్యలో సెంట్రల్ బస్టాండ్ దగ్గర ఆ యువకుడు మళ్లి వారికి ఎదురుపడ్డాడు. మళ్లి యువతులను దూషించడం మొదలు పెట్టారు. యువతులు అతనిని పట్టుకుని దాడి చేశారు. యువకుడు తప్పించుకుని పారిపోతూ మార్గం మద్యలో రోడ్డు మీద కుప్పకూలిపోయాడు.

వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించగా మరణించాడని వైద్యులు నిర్దారించారు. జనవరి నాలుగవ తేదిన ఎస్ఐ గణేష్, మహిళా ఎస్ఐ ఇద్దరు యువతుల ఇంటి దగ్గరకు వెళ్లి వారిని పిలుచుకుని పోలీస్ స్టేషన్ దగ్గరకు వెళ్లారు.

తరువాత ఎస్ఐ సూచనల మేరకు మహిళా పోలీసులు దుస్తులు విప్పాలని ఇద్దరు యువతులను వేదించారు. చివరికి వారిని నగ్నంగా తయారు చేసి ఎక్కడపడితే అక్కడ కారం చల్లి వేదింపులకు గురిచేశారు.

జనవరి 6వ తేది సాయంత్రం వరకు వారిని పోలీస్ స్టేషన్ లోనే పెట్టారు. మళ్లి విచారణకు రావాలని చెప్పి ఇద్దరు యువతులను పంపించారు. ఓ యువతి, ఆమె తల్లి పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా కమిషనర్ కార్యాలయం చేరుకున్నారు.

డీసీపీ సందీప్ అతోలేని కలిసి జరిగిన విషయం చెప్పి ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్ లో మా మీద దాడి చూసి బూతులు తిట్టి చెప్పుకోలేని చోట (సున్నితమైన ప్రాంతాలు) కారం చల్లి వేదింపులకు గురి చేశారని ఇద్దరు యువతులు విలపించారు.

వెంటనే ఇద్దరు యువతులను ఆసుపత్రికి తరలించి వైద్య పరిక్షలు చేయించారు. వేదింపులు జరిగిన విషయం వెలుగు చూసింది. ఇది చాల సీరియస్ విషయం, క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నామని కమిషనర్ అమితేష్ కుమార్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+