Manipur riots: మణిపూర్ లో ఎంత మంది మహిళల మీద అత్యాచారాలు జరిగాయి !
మణిపూర్: దేశ వ్యాప్తంగా ఇప్పుడు మణిపూర్ హింస గురించే చర్చించుకుంటున్నారు. హణిపూర్ లో రోజురోజుకు హింస పెరిగిపోవడంతో భారతదేశంలోని వివిద రాష్ట్రాల ప్రజలతో పాటు ప్రపంచ దేశాలు అందోళన వ్యక్తం చేస్తున్నాయి. మే 3 నుంచి మణిపూర్‌లో హింస చెలరేగింది. ఇప్పుడు మణిపూర్ లో జరిగిన అత్యాచారం కేసులపై రోజురోజుకు ఆరోపణలు పెరిగిపోతున్నాయి.
మే 4వ తేదీన మణిపూర్‌లోని కాంగ్‌పోక్పిలో కుకీ కమ్యూనిటీకి చెందిన ఇద్దరు మహిళలను ఒక గుంపు నగ్నంగా ఊరేగించి, లైంగికంగా వేధించినట్లు చూపించే వీడియో గత వారం రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారింది. ఆ తర్వాత మణిపూర్ లో అనేక లైంగిక వేధింపుల ఘటనలు జరిగాయని వెలుగులోకి వస్తున్నాయి.

హత్య, దహనం, అల్లర్లకు సంబంధించిన ఫిర్యాదులతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన 6,068 ఎఫ్‌ఐఆర్‌లలో ఒకే ఒక్క అత్యాచారం కేసు మాత్రమే నమోదైంది అని మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. మే 3న మణిపూర్‌లో జాతి హింస మొదలు కావడంతో ఆ రాష్ట్రంలో హింస చెలరేగింది. ఇప్పటికే వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు చాలా మంది గాయపడి ఆసుపత్రుల్లో ఉన్నారు.
మణిపూర్ జనాభాలో 53 శాతం ఉన్న మేథిలు ఇంఫాల్ లోయలో నివసిస్తున్నారు, నాగాలు మరియు కుకీలతో కూడిన గిరిజనులు 40 శాతం మంది ఉన్నారు. ఎక్కువగా కొండ జిల్లాలలో నివసిస్తున్నారు. వైపై పీపుల్స్ కౌన్సిల్, యంగ్ వైపై అసోసియేషన్, జోమీ స్టూడెంట్స్ ఫెడరేషన్, కుకీ స్టూడెంట్స్ ఫెడరేషన్ వర్గాలు ఆందోళనలకు దిగడంతో హింస చెలరేగింది. ఇప్పటికి మణిపూర్ లో ఏడుగురు కుకీ మహిళలపై అత్యాచారం చేశారని ఆరోపణలు ఉన్నాయి.

27 మంది మహిళల్లో 7 మంది మహిళలు అత్యాచారానికి గురయ్యారని ఆరోపణలు ఉన్నాయి, ఎనిమిది మందిని కొట్టి చంపారని, ఇద్దరిని కాల్చి చంపారని, ఐదుగురిని కాల్చి చంపారని, ముగ్గురు నరికి చంపారని, మిగిలిన వారి మృతికి గల కారణాలు తెలియరాలేదని ప్రత్యర్థి వర్గాలు ఆరోపిస్తున్నాయి. కార్ వాష్ సెంటర్ లో ఇద్దరు బాలికలపై సామూహిక అత్యాచారం జరిగిన మరొక కేసు గురించి అడిగిన ప్రశ్నకు, శవపరీక్ష నివేదిక అత్యాచారం లేదా మరేదైనా లైంగిక వేధింపులను తోసిపుచ్చిందని మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ చెప్పారు.
ఢిల్లీ కమీషన్ ఫర్ ఉమెన్ చీఫ్ స్వాతి మలివాల్ మణిపూర్ రాష్ట్రాన్ని సందర్శించడానికి మణిపూర్ ప్రభుత్వం అనుమతి కోరింది. మణిపూర్ ప్రభుత్వం అందుకు నిరాకరించినప్పటికీ అత్యాచార బాధితులతో సంభాషించడానికి ఇంఫాల్‌కు వచ్చారు. దయచేసి నన్ను అనుమతించండి. నేను రాజకీయాలు చేయడానికి ఇక్కడకు రాలేదు. మణిపూర్‌లో పర్యటించాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీని మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీని అభ్యర్థిస్తున్నాను అని కూడా ఆమె ఏఎన్ఐ మిడియ చెప్పారు.












Click it and Unblock the Notifications