మహిళా రిజర్వేషన్ బిల్లుపై తేల్చేసిన మోదీ.. కొత్త పేరు ఇదే

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కొత్తగా నిర్మించిన కొత్త పార్లమెంట్ భవన సముదాయం మనుగడలోకి వచ్చింది. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది కేంద్రం. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు కొద్దిసేపటి కిందటే కొత్త పార్లమెంట్ భవనంలో లాంఛనంగా అడుగుపెట్టారు.

ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, పీయూష్ గోయెల్, నితిన్ గడ్కరీ, ప్రహ్లాద్ జోషి.. ఇలా కేంద్ర మంత్రులు, బీజేపీ సభ్యులందరూ ఒక జట్టుగా కొత్త పార్లమెంట్ భవనంలో అడుగుపెట్టారు. మహిళా సభ్యులందరూ మరో జట్టుగా బయలుదేరి వెళ్లడం కనిపించింది.

Womens Reservation Bill named as Nari Shakti Vandan Adhiniyam

ఇక కాంగ్రెస్ సభ్యులందరూ మరో జట్టు కట్టారు. రాహుల్ గాంధీతో కలిసి వారంతా కొత్త పార్లమెంట్ వైపు సాగిపోయారు. లోనికి అడుగుపెట్టడానికి ముందు వారంతా కొత్త పార్లమెంట్ భవనం ప్రధాన ద్వారం వద్ద గ్రూప్ ఫొటో దిగారు. ఈ సమయంలో అధిర్ రంజన్ చౌదరి.. రాజ్యాంగ ప్రతిని ప్రదర్శించారు.

కొత్త పార్లమెంట్ భవనంలో ప్రవేశించిన వెంటనే జాతీయ గీతాలాపనతో సభా కార్యకలాపాలు మొదలయ్యాయి. స్పీకర్ ఓం బిర్లా తన స్థానంలో ఆసీనులయ్యారు. ఆ వెంటనే ప్రధాని మోదీ ప్రసంగించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు సహా పలు కీలకాంశాలను ఆయన ప్రస్తావించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రమంత్రి వర్గం ఆమోదించిందనీ పేర్కొన్నారు.

దీనికి తమ ప్రభుత్వం నారీ శక్తి వందన్ అధినియంగా పేరు పెట్టినట్లు మోదీ తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్ర మంత్రివర్గంలో చాలాసేపు చర్చించామని పేర్కొన్నారు. దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో మహిళా రిజర్వేషన్ బిల్లు చాలాసార్లు సభ ముందుకు వచ్చిందని, దాన్ని ఆమోదింపజేసుకోవడానికి తగినంత మెజారిటీ అప్పట్లో అధికార పక్షానికి లేదని గుర్తు చేశారు.

సంపూర్ణ మెజారిటీ లేకపోవడం వల్ల మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్‌ను కల్పించాలనే ఓ కల సాకారం కాలేదని, కార్యరూపాన్ని దాల్చ లేకపోయిందని మోదీ చెప్పారు. ఇప్పుడు అదే బిల్లును ఆమోదింపజేసుకునే అవకాశం తనకు లభించిందని పేర్కొన్నారు. అలాంటి ఓ చక్కటి అవకాశాన్ని భగవంతుడు తనకు ఇచ్చాడని అన్నారు.

ఉభయ సభల్లో మహిళల భాగస్వామ్యంపై తమ ప్రభుత్వం నేడు కొత్తగా ఓ బిల్లును తీసుకువస్తోందని తేల్చి చెప్పారు. ఈ బిల్లును సభ ఏకగ్రీవంగా ఆమోదిస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా కొత్త పార్లమెంట్‌ భవనంలో ఈ బిల్లును ముక్తకంఠంతో సభ్యులు ఆమోదించాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+