బుల్లెట్లు లెక్కపెట్టం: పాక్‌కు రాజ్‌నాథ్ ఘాటు హెచ్చరిక

ఫతేగఢ్: జమ్మూకాశ్మీర్‌లోని పాంపోర్‌లో సీఆర్పీఎఫ్‌ జవాన్లపై జరిగిన ఉగ్రదాడిపై కేంద్ర హోంశాఖ మంత్రి తీవ్రంగా స్పందించారు. పంజాబ్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన రాజ్‌నాథ్‌ ఈ ఘటనపై మాట్లాడుతూ పాకిస్థాన్‌ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది.

'భారత్‌ తమంతట తాము కాల్పులకు పాల్పడదు. పాక్‌ నిబంధనలకు వ్యతిరేకంగా కాల్పులు జరిపితే సహించబోమన్నారు. తిరిగి జరిపే కాల్పులకు సంబంధించి బుల్లెట్లు లెక్కపెట్టుకోం' అని రాజ్‌నాథ్ ఘాటు హెచ్చరిక చేశఆరు.

ఈ ఘటనపై విచారణ జరపడానికి ఇద్దరు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఉగ్రవాదుల దాడిని తిప్పికొట్టిన జవాన్లను మెచ్చుకున్నారు. వారి ధైర్యసాహసాలను సెల్యూట్‌ చేస్తున్నామన్నారు. వాళ్లపై ఎదురుదాడికి పాల్పడి ఇద్దరు ఉగ్రవాదులను మట్టుపెట్టినందుకు అభినందించారు.

Won't Count Bullets If Pakistan Fires First: Rajnath Singh After Pampore Attack

ఉగ్రవాదులు శనివారం పొంపోర్‌లో సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడులకు తెగబడిన విషయం తెలిసిందే. దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లా పాంపోర్ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనంపై కాల్పులు జరిపారు. ఫైరింగ్ ప్రాక్టీస్ ముగించుకొని తిరిగివస్తున్న సీఆర్పీఎఫ్ జవాన్ల వాహనంపై ఇద్దరు ఉగ్రవాదులు దాడి చేశారు. ఎనిమిది మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందగా, మరో 20కిపైగా జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.

ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమరులైన జవాన్ల ధైర్య సాహసాలకు సెల్యూట్ చేస్తున్నానన్నారు. దేశానికి ఎంతో అంకితభావంతో సేవలు చేశారని ట్వీట్ చేశారు. అమరుల కుటుంబాలకు సంతాపం ప్రకటించడంతో పాటు, గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+