టి హీట్: లోక్‌పాల్ బిల్లే ఫస్ట్, ప్రోరోగ్ కాదు.. కమల్‌నాథ్

ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో రోజు పార్లమెంటు సమావేశాలు సజావుగా జరగడంలేదు. అయితే, కమల్ నాథ్ మాత్రం తమ మొదటి ప్రాధాన్యత లోక్‌పాల్ బిల్లుకేనని చెబుతున్నారు. కాగా, పార్లమెంటు సమావేశాలు ప్రారంభమై ఐదు రోజులు దాటినా ఇప్పటి వరకు సభ సజావుగా సాగలేదు.
రాజ్యసభలో రేపు లోక్‌పాల్ బిల్లు
రాజ్యసభలో రేపు లోక్‌పాల్ బిల్లు ప్రవేశ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. జన్ లోక్‌పాల్ బిల్లు కోసం అన్నా హజారే రాలేగావ్ సిద్ధిలో దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఈయన దీక్షకు మద్దతు తెలిపేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ గురువారం అక్కడకు వెళ్లనున్నారు.
ఉభయ సభలు వాయిదా
గురువారం ఉదయం పార్లమెంటు ఉభయ సభలు ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడ్డాయి. సీమాంధ్ర ప్రాంత ఎంపీలు సమైక్య నినాదాలు చేస్తూ పోడియంను చుట్టుముట్టారు. దీంతో లోకసభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ సభను మధ్యాహ్నం పన్నెండు గంటలకు వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications