మళ్లీ రాజకీయాల్లో రాను: అమితాబ్ బచ్చన్
ముంబై: తాను తిరిగి రాజకీయాల్లోకి రాలేనని బాలీవుడ్ మెగాస్టార్, మాజీ పార్లమెంటు సభ్యుడు అమితాబ్ బచ్చన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం బిగ్ బి ‘భూత్ నాథ్ రిటర్న్స్' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. నితేష్ తివారీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రాజకీయ నాయకులు, అవినీతిపై సెటైరికల్‌గా కూడా ఉంటుందని ప్రచారం సాగుతోంది.
ఈ నేపథ్యంలోనే మళ్లీ రాజకీయాల్లోకి ఆలోచన ఏమైనా ఉందా అని మీడియా ప్రశ్నించగా.. తాను మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు అమితాబ్ బచ్చన్. ‘భూత్ నాథ్ రిటర్న్స్' చిత్రంలో అమితాబ్ బచ్చన్ దెయ్యం పాత్రలో అలరించనున్నారు.

ఈ పాత్ర ద్వారా రాజకీయ నాయకులపై సెటైర్లు విసరనున్నారని ప్రచారం సాగుతోంది. అంతేగాక అవినీతిపై కూడా ఈ చిత్రం ప్రశ్నలు సంధించేలా ఉండనుందని పలువురు సినీ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే తాను మళ్లీ రాజకీయాల్లో వచ్చే ఆలోచన లేదని అమితాబ్ బచ్చన్ తేల్చి చెప్పారు.
1984 లోకసభ ఎన్నికల్లో పోటీ చేసిన అమితాబ్ బచ్చన్ భారీ మెజార్టీతో గెలుపొందారు. మూడేళ్లపాటు పదవిలో కొనసాగిన అమితాబ్, ఆ తర్వాత తన పదవికి రాజీనామా చేశారు. రాజకీయాల్లో ఇమడలేకే ఆయన తన పదవికి రాజీనామా చేసివుంటారని పలువురు భావించారు. కాగా, ప్రస్తుతం అమితాబ్ భార్య జయాబచ్చన్ రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగుతున్నారు.












Click it and Unblock the Notifications