నటనకు ఎంపీ రమ్య గుడ్‌బై: విమర్శల భయం వల్లేనా?

Won't take up film projects: Ramya
బెంగళూరు: ప్రముఖ కన్నడ నటి, మండ్య కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యురాలు రమ్య త్వరలో నటనకు గుడ్ బై చెప్పబోతున్నారట! ప్రస్తుతం మైసూరులో కన్నడ సినిమా ఆర్యన్ షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో శివరాజ్ కుమార్ సరసన ఆమె నటిస్తున్నారు.

ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, రెండు మూడు రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుందని, దిల్ కా రాజా, నీర్ దోసె, కోడిరామకృష్ణ దర్శకత్వంలో తెలుగు, కన్నడ భాషలలో తెరకెక్కుతున్నసినిమాలు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. ఈ సినిమాలు పూర్తయిన తర్వాత కొత్త చిత్రాలను అంగీకరించనని తెలిపారు.

నటన, రాజకీయాలకు ఒకేసారి న్యాయం చేయలేనని భావించే ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు. ఇక పూర్తిగా రాజకీయాల్లో ఉంటానని తెలిపారు. కొత్తగా ఒక్క సినిమాను అంగీకరించలేదన్నారు. ఒక సినిమా పూర్తి కావాలంటే నలభై రోజుల వరకు సమయం పడుతుందని, ఈ రోజుల్లో ప్రజలకు దూరంగా ఉండవలసి వస్తోందన్నారు. మరో పదేళ్ల తర్వాత శివరాజ్ కుమార్ సోదరిగా నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానన్నారు.

కాగా, రమ్య ప్రకటనపై కన్నడ సినీ, రాజకీయ వర్గాల్లో భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. సినిమాలలో నటిస్తూ, ప్రజలకు ఎలా అందుబాటులో ఉంటారని ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులు విమర్శలు ఎక్కుపెట్టే అవకాశాలున్నాయి. వాటిని అడ్డుకోవడానికే రమ్య ముందు జాగ్రత్తగా ఇలాంటి ప్రకటన చేసి ఉంటారని అంటున్నారు. ప్రస్తుతం మాండ్య ఎంపీగా ఉన్న ఆమె సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+