జాతి మొత్తం మీ వెనకే ఉంది.. ఇస్రో శాస్త్రవేత్తలకు రాహుల్ గాంధీ భరోసా, కొనియాడిన కాంగ్రెస్
Recommended Video
న్యూఢిల్లీ : మరికొద్ది సెకన్లలో చంద్రుడి ఉపరితలాన్ని విక్రమ్ ల్యాండర్ ముద్దాడే సమయంలో తలెత్తిన సాంకేతిక లోపంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ప్రయోగం సక్సెస్ కాలేదనే అంశం వారిని మొహల్లో స్పష్టంగా తెలుస్తోంది. బెంగళూరు ఇస్రో కేంద్రంలో ప్రధాని మోడీ ప్రయోగాన్ని విద్యార్థులతో కలిసి పరిశీలించారు. తర్వాత ఇస్రో చైర్మన్ శివన్ భావోద్వేగానికి గురవడంతో .. హత్తుకొని ఓదార్చారు. మీ సేవలను చూసి జాతి గర్విస్తోందని .. ఈ ప్రయోగం బ్రేక్ మాత్రమేనని .. ఇప్పటికే విజయాలు సాధించారని ... మరిన్ని విజయాలు సాధిస్తారని ఓదార్పునిచ్చారు. తర్వాత కాంగ్రెస్ నేత రాహుల్ కూడా శాస్త్రవేత్తలకు ధైర్యం కల్పించారు.
'చంద్రయాన్ -2 కోసం మీరు అహోరాత్రులు శ్రమించారు. అంకితభావంతో కలిసి సమిష్టిగా పనిచేశారు. కానీ చివరి క్షణంలో విక్రమ్ ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోవడం బాధాకరం. చంద్రయాన్ -2 కోసం మీరు చేసిన పని మిగతా దేశంలోని ప్రతి ఒక్కరికీ ప్రేరణ కలిగిస్తోంది. చంద్రయాన్-2 కోసం మీరు చేసిన పని మాత్రమే ఫలించలేదు. కానీ ఇప్పటివరకు మీరు సాధించిన విజయాలు కళ్లముందు కదలాడుతున్నాయి' అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

మరోవైపు 'కాంగ్రెస్ పార్టీ కూడా ఇస్రో శాస్త్రవేత్తల కృషిని అభినందించింది. చంద్రయాన్-2 కోసం మీరు చేసిన పనిని జాతి యావత్ గమనించిందని .. ఈ క్లిష్ట సమయంలో జాతి యావత్ మొత్తం మీ వెనక ఉంటుందని స్పస్టంచేసింది. చంద్రయాన్-2 కోసం మీరు కృతనిశ్చయంతో చేసిన పనిని చూసి జాతి యావత్ గర్వపడుతుంది' అని ట్వీట్‌లో కాంగ్రెస్ పార్టీ కూడా పేర్కొంది. విక్రమ్ ల్యాండర్ చంద్రుడుకి 2.1 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు సిగ్నల్స్ పోయిన సంగతి తెలసిందే.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications