వరల్డ్ ఫుడ్ ఇండియా: ఇది 800కేజీల గిన్నిస్ రికార్డ్ కిచిడీ(పిక్చర్స్)
దేశ రాజధానిలో జరుగుతున్న వరల్డ్ ఫుడ్ ఇండియా వేడుకలో 800 కేజీల కిచిడీని తయారు చేసి గిన్నిస్ రికార్డు సృష్టించారు. ఈ కిచిడీని పాక శాస్త్ర నిపుణుడు, చీఫ్ షెఫ్ సంజీవ్ కపూర్ తయారు చేశార
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో జరుగుతున్న వరల్డ్ ఫుడ్ ఇండియా వేడుకలో 800 కేజీల కిచిడీని తయారు చేసి రికార్డు సృష్టించారు. దీన్ని గిన్నిస్ రికార్డు బృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ కిచిడీని పాక శాస్త్ర నిపుణుడు, చీఫ్ షెఫ్ సంజీవ్ కపూర్ తయారు చేశారు.
చేతులేసిన ప్రముఖులు..
ఈ వేడుకకు బ్రాండ్ అంబాసిడర్ కూడా సంజీవ్ కపూర్ కావడం గమనార్హం. కిచిడీ తయారీ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు హర్‌సిమ్రత్ కౌర్, సాధ్వీ నిరంజన్, యోగా గురువు బాబా రాందేవ్‌లు కూడా హాజరయ్యారు. కిచిడీ తయారీలో వారు కూడా చేతులు కలిపారు.
రికార్డు నేపథ్యంలో పుకార్లు..
ఇటీవల ఈ రికార్డు నేపథ్యంలో కిచిడీని జాతీయ వంటకంగా ప్రకటించే అవకాశం ఉందంటూ పుకార్లు వచ్చాయి. అయితే దీనిపై స్పష్టతనిస్తూ కేంద్ర మంత్రి హర్ సిమ్రత్ కౌర్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
భారీ వంటకం..
800 కిలోల కిచిడీని చేసేందుకు సుమారు వెయ్యి లీటర్ల గిన్నెను ఉపయోగించారు. కాగా, నవంబర్ 5వ తేదీతో ఈ వరల్డ్ ఫుడ్ ఇండియా వేడుక ముగియనుంది.
ఇష్టంగా తింటారు..
కాగా, కిచిడీ ఇది ప్రతి భారతీయుడి ఆహారం. పేదలు, ధనికులు ఈ డిష్‌ను ఇష్టంగా సేవిస్తారు. బియ్యం, పప్పు, టమాట, మసాలతో కిచిడీని తయారు చేస్తారు. కిచిడీని జాతీయ వంటగా ప్రకటించే అవకాశాలున్నాయని కూడా సోషల్ మీడియాలో పుకార్లు చక్కర్లు కొట్టాయి. కానీ, కేవలం రికార్డు కోసం అంత మొత్తంలో కిచిడీని తయారు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ తెలిపారు.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications