తల్లి, తండ్రి కాదు.. మన దగ్గరుంది ‘తాత’! దీనిముందు అమెరికా, రష్యా బలాదూర్!!
అమెరికా ‘తల్లిబాంబు’.. రష్యా ‘తండ్రిబాంబు’లను మించిన బాంబు.. వాటికి ‘ తాత’ లాంటి బాంబు ఎవరి దగ్గర ఉందో మీకు తెలుసా? మన దగ్గర. నిజం.. చదవండి మీకే తెలుస్తుంది.
న్యూఢిల్లీ: రేడియేషన్ విడుదల చేయని అతి శక్తిమంతమైన మాసివ్ ఆర్డినెన్స్ ఎయిర్ బ్లాస్ట్ బాంబ్(ఎంఓఏబీ) ఆప్ఘనిస్తాన్‌లోని ఐసిస్ స్ధావరంపై ప్రయోగించినట్లు అమెరికా పేర్కొంది. ఈ బాంబుకు మరో పేరు 'మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్'(ఎంఓఏబీ).
ఇటీవల అమెరికా ప్రయోగించిన ఈ బాంబు దాడిలో దాదాపు 100 మంది తీవ్రవాదులు హతం కావడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో రష్యా స్పందించింది. తమ వద్ద దీన్ని మించిన 'ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్'(ఎఫ్ఓఏబీ) ఉందంటూ పేర్కొంది.

మన దగ్గరుంది ‘తాత’...
అయితే, అసలు రేడియేషన్ కలిగించని శక్తిమంతమైన బాంబు ఎవరి దగ్గరుందో మీకు తెలుసా? మన దగ్గర. అవును.. భారత్ వద్ద రేడియేషన్ కలిగించని శక్తిమంతమైన బాంబు ఉంది.

15 రెట్లు శక్తిమంతమైనది...
దీనిని ఆరేళ్ల క్రితమే మన డీఆర్‌డీవో అభివృద్ధి చేసింది. దీని పేరు సీఎల్-20. సంప్రదాయ పేలుడు పదార్ధాల కంటే 15 రెట్లు ఇది శక్తిమంతమైనది. అయితే, దీనిని ఎలా ప్రయోగిస్తారు అనే విషయం మాత్రం సీక్రెట్.

‘స్పైస్’ కూడా...
ఇక ఇండియా వద్ద ఉన్న మరో బాంబు పేరు ‘స్మార్ట్ ప్రిసైజ్ ఇంపాక్ట్ అండ్ కాస్ట్ ఎఫెక్టీవ్'(ఎస్‌పీఐసీఈ). సింపుల్‌గా దీనిని ‘స్పైస్' అంటారు. దీనిని కార్గో విమానాల నుంచి ప్రయోగించాల్సిన అవసరం లేదు.

ప్రయోగించడం సులువు...
ఇండియా వద్ద గల మిరేజ్ 2000, సుఖోయ్ జెట్ల నుంచి సులువుగా ఈ స్పైస్ బాంబును మోసుకెళ్లొచ్చు. ఉగ్రవాదుల స్ధావరాలను నేల మట్టం చేయాలనుకున్న సమయంలో దీన్ని భారత్ ఉపయోగించుకునే అవకాశం ఉంది.

ఫస్ట్ చాయిస్ ఇదే...
‘స్పైస్'ను అభివృద్ధి చేసింది ఇజ్రాయెల్‌కు చెందిన రాఫెల్ అడ్వాన్స్‌డ్ డిఫెన్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్. స్పైస్ బాంబు బరువు కేవలం 1000 కేజీలు. సర్జికల్ స్ట్రైక్స్ లాంటి వాటిని ఎయిర్‌ఫోర్స్ ద్వారా నిర్వహించాలనుకుంటే మొట్టమొదట ఎంచుకునేది ఈ ‘స్పైస్' బాంబునే.
-
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
ముంబాయి ఇండియన్స్ కెప్టెన్సీ వార్ పీక్, ఆ ఇద్దరిలో ఫైనల్ గా..!! -
అప్పటి వరకూ పాకిస్థాన్ కు నో వాటర్: భారత్ సంచలనం -
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
ఏసీ గదుల్లో ఎక్కువగా ఉంటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం











Click it and Unblock the Notifications