వరల్డ్ టాప్-10 రైల్వేస్టేషన్స్.. ఇండియాలోనే

రైల్వే వ్యవస్థ రూపొందించుకున్న దేశాల్లో భారత్ కు ప్రత్యేక స్థానం ఉంటుంది. అన్ని దేశాల్లోకన్నా భారత్ లో రైల్వేస్టేషన్లు ఎక్కువ. అంతేకాదు.. ప్రపంచంలో అతి పొడవైన ప్లాట్ ఫామ్ కలిగిన రైల్వేస్టేషన్లు కూడా మనదగ్గరే ఉన్నాయి. ప్రపంచంలోనే అతి పొడవైన ప్లాట్ ఫామ్ ఉన్న టాప్ 10 స్టేషన్లలో కర్నాటకలోని హుబ్లీది మొదటిస్థానం.

* కర్ణాటకలోని హుబ్లీలో సిద్ధరూడ స్వామిజీ రైల్వే స్టేషన్‌ ఉంది. ఈ స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్‌ పొడవు 1505 మీటర్లు (4,938 అడుగుల). మొత్తం 8 ప్లాట్‌ ఫారాలున్నాయి. 1, 8 నెంబరు ప్లాట్ ఫామ్స్ పొడవైన ట్రాక్‌ను కలిగి ఉన్నాయి.
* ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లో టాప్ 2 లో నిలిచే పొడవైన ప్లాట్ ఫామ్ ఉంది. దీని పొడవు 1366.33 మీటర్లు (4483 అడుగులు).

railwaystation

* కేరళలోని కొల్లంలో టాప్ 3 స్టేషన్ ఉంది. ఈ ప్లాట్‌ ఫామ్‌ పొడవు 1180.5 మీటర్లు (3873 అడుగులు).
* పశ్చిమ బెంగాల్ లోని ఖరగ్ పూర్ రైల్వేస్టేషన్ నాలుగోస్థానంలో నిలుస్తుంది. ప్లాట్‌ఫామ్‌ పొడవు 1072.5 మీటర్లు (3519 అడుగులు).
* స్టేట్‌ స్ట్రీట్‌ సబ్‌వే ఆఫ్‌ చికాగో (US) టాప్ 5లో ఉంది. ప్లాట్‌ఫామ్‌ పొడవు 1067 మీటర్లు (3501 అడుగులు). ఉత్తర అమెరికాలోనే అతి పొడవైన ప్లాట్‌ఫామ్‌గా పేరు పొందింది.
* ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌ రైల్వే జంక్షన్‌ టాప్ 6 లో ఉంది. పొడవు దాదాపు 900 మీటర్లు (2953 అడుగులు).
* టాప్ 7లో యూఎస్‌లోని కాలిఫోర్నియాలో పోంటానా అనే ఆటో క్లబ్‌ స్పీడ్‌వే స్టేషన్‌ ఉంది. దీని పొడవు 791 మీటర్లు (2675).
* టాప్ 8లో ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌ స్టేషన్‌ 802 మీటర్ల పొడవు (2631 అడుగులు) ఉంది.
* టాప్ 9లో బ్రిటన్‌కు చెందిన షెరటన్‌ షటిల్‌ టెర్మినల్‌ ఫోక్‌స్టోన్‌ (UK). దీని ప్లాట్‌ఫాం పొడవు 731 మీటర్లు (2595 అడుగులు)
* టాప్ 10లో ఉత్తరప్రదేశ్‌లోని ఝూన్సీ స్టేషన్‌ ఉంది. దీని ప్లాట్‌ఫాం పొడవు 770 మీటర్లు (2526 అడుగులు).
* పశ్చిమ ఆస్ట్రేలియాలోని ఈస్ట్‌ పెర్త్‌ రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ ఫాం పొడవు కూడా 770 మీటర్లు. ఆస్ట్రేలియాలోనే అతి పొడవైన స్టేషన్‌గా గుర్తింపు పొందింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+