రైతులు ఇళ్ల దగ్గరే చావొచ్చుగా, ఉద్యమాలెందుకు? -బీజేపీ మంత్రి దలాల్ దివాళాకోరు కామెంట్లు -యూటర్న్

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ శివారుల్లో వేలాది మంది రైతులు చేస్తోన్న నిరసనలు ఆదివారం నాటికి 81వ రోజులు పూర్తయ్యాయి. రిపబ్లిక్ డే నాటి హింస తర్వాత రైతులు, కేంద్రం మధ్య చర్చల ప్రక్రియ కూడా నిలిచిపోయింది. ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేయడానికి రైతులు ప్రయత్నిస్తుండగా, దాన్ని అడ్డుకునేందుకు సర్కారు తీవ్రంగా శ్రమిస్తోంది. రైతులను ఉద్దేశించి టెర్రరిస్టులు, ఖలీస్తానీ విభజనకారులంటూ బీజేపీ నేతలు ఎదురుదాడి చేస్తున్న క్రమంలో ఆ పార్టీకి చెందిన మంత్రి ఒకరు చనిపోయిన రైతులపైనా సంకుచిత వ్యాఖ్యలు చేశారు..

గడిచిన మూడు నెలలుగా కొనసాగుతోన్న ఉద్యమంలో కనీసం 200 మంది రైతులు వివిధ కారణాలతో ప్రాణాలు కోల్పోవడం, వారిని అమరులుగా గుర్తించాలని రైతు సంఘాలు, విపక్షాలు డిమాండ్ చేస్తుండటం తెలిసిందే. హర్యానా వ్యవసాయ శాఖ మంత్రి జేపీ దలాల్ రైతుల మరణాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ''రైతులు ఆందోళన చేస్తున్నందుకే చస్తున్నారా ? ఏం? వాళ్లంతా ఇళ్లలోనే ఉండుంటే చావకపోయేవారా? ఆందోళనలో పాల్గొంటున్న రెండు లక్షల మంది ఇప్పటికీ ఇళ్లలోనే ఉండుంటే వారిలో కనీసం 200 మందైనా చచ్చేవాళ్లు కాదా?'' అని మంత్రి దలాల్ అన్నారు. దీనిపై..

 Wouldnt they die at home: BJP minister Minister JP Dalal apologises after backlash

బీజేపీ మంత్రి దలాల్ వ్యాఖ్యలు దివాళకోరుతనాన్ని సూచిస్తున్నాయని విపక్ష కాంగ్రెస్ మండిపడింది. దలాల్ రాజీనామాను డిమాండ్ చేస్తూ హర్యానా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు చేసింది. తాప్సీ పన్ను, రిచా చడ్డా లాంటి బాలీవుడ్ ప్రముఖులు సైతం మంత్రి కామెంట్లను ఖండించారు. సోషల్ మీడియాలో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో మంత్రి దలాల్ యూటర్న్ తీసుకున్నారు...

తన మాటలను మీడియా వక్రీకరించిదని హర్యానా మంత్రి దలాల్ చెప్పుకొచ్చారు. ఆదివారం మరోసారి స్పందించిన ఆయన.. తాను ఒకటి మాట్లాడితే, మీడిమా మరోలా ప్రసారం చేసిందని సెలవిచ్చారు. ఏదిఏమైనా తాను ఎప్పటికీ రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉంటానని, తన మాటలతో ఎవరైనా బాధ పడితే క్షమించాలని ఆయన ఓ ప్రకటనలో కోరారు. ఈ ప్రకటన వెలువడిన తర్వాత మంత్రి వ్యాఖ్యల వీడియో మళ్లీ వైరలైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+