డిసెంబర్ ౩౦ తర్వాత అవినీతి పరులకు కష్టాలే: మోడీ తాజా హెచ్చరిక
డిసెంబర్ ౩౦ తర్వాత అవినీతి పరులకు కష్టాలు పెరుగుతాయని ప్రధాని నరేంద్రమోదీ తాజాగా హెచ్చరించారు.
ముంబై: డిసెంబర్ ౩౦ తర్వాత అవినీతి పరులకు కష్టాలు పెరుగుతాయని ప్రధాని నరేంద్రమోదీ తాజాగా హెచ్చరించారు. అదే సమయంలో నీతిపరుల కష్టాలు క్రమంగా తగ్గుతాయన్నారు. ముంబయిలోని బంద్రాకుర్లా కాంప్లెక్స్ వద్ద శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
నవంబర్ 8న నోట్ల రద్దు నిర్ణయంతో దేశంలో అవినీతిపై యుద్ధం ప్రకటించామని, యాభై రోజులపాటు ఇబ్బందులు ఉంటాయని ముందే చెప్పామని, దేశ భవిష్యత్తు కోసం ఎలాంటి ఇబ్బందులనైనా అధిగమించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఈ యాభై రోజుల తరువాత నిజాయితీపరుల ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పారు.

నల్ల కుబేరులు కుయక్తులతో నల్లధానాన్ని తెల్లధనంగా మార్చుకునేందుకు తమతోపాటు బ్యాంకు సిబ్బందిని బలిచేస్తున్నారని పేర్కొన్నారు. బ్యాంకుల్లో డిపాజిట్ చేశాం కదా.. ఇంకే సమస్యలు ఉండబోవని ఊపిరి పీల్చుకుంటున్న నల్ల కుబేరులకు మోదీ మరోసారి తాజాగా వార్నింగ్ ఇచ్చారు.
చట్టంలో లొసుగుల ఆధారంగా ఎదో ఒక రూపంలో తప్పించుకోవచ్చని చూస్తున్నారని, ఇలాంటి వారు ప్రస్తుతం ఉన్నది మోదీ సర్కారు అన్న విషయం గుర్తుంచుకోవాలని చెప్పారు.
బ్యాంకుల్లో డబ్బు పడడంతో కష్టాలు ముగిసినట్లు కాదని, అసలు కష్టాలు మొదలైనట్లు గుర్తించాలని మోదీ సూచించారు. కొంతమంది నల్ల కుబేరుల కారణంగా దేశ ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆర్థిక నేరాలకు పాల్పడిన ప్రతి ఒక్కరూ ప్రజల ఆగ్రహానికి బలికాక తప్పదని ఆయన హెచ్చరించారు.












Click it and Unblock the Notifications