డ్రాగన్‌కు రష్యా ఆఫర్.. గ్యాస్ సరఫరా చేస్తామని పుతిన్ ప్రకటన
ఉక్రెయిన్.. ఇతర సమస్యల ఉన్న నేపథ్యంలో రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. తన నేస్తం చైనాకు మంచి ఆఫర్ ఇచ్చింది. శుక్రవారం చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌తో రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ సమావేశం అయ్యారు. ఈ క్రమంలో చైనాకు మరింత గ్యాస్ సరఫరా చేస్తామని పుతిన్ తెలిపారు. రష్యాలో మేజర్ హైడ్రో కార్బన్ ఉత్పత్తి అవుతుండగా.. బిజీంగ్ గ్యాస్ సరఫరాలో మూడో స్థానంలో ఉంది. దీంతో ఆ రెండు దేశాలు ప్రపంచంలో శక్తిమంత ఎనర్జీగా మారనుంది.
10 బిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ సరఫరా చేస్తామని పుతిన్ తెలిపారు. వింటర్ ఒలింపిక్స్‌లో బీజింగ్‌లో జరుగుతున్న సంగతి తెలిసిందే. వాటికి పుతిన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిన్‌పింగ్‌తో సమావేశమై.. కీలక ప్రతిపాదన చేశారు. సైబిరియా పైప్ లైన్ నుంచి గ్యాస్ సప్లై చేస్తామని రష్యా ప్రకటించింది. ఇదీ ఇప్పుడే కాదు 2019 నుంచి సప్లై అవుతుంది. షిప్పింగ్ లిక్విఫైడ్ నాచురల్ గ్యాస్.. 2021లో బిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ పంపించింది.

Recommended Video
2021లో 10.5 బీసీఎం పంపగా.. 2025లో 38 బీసీఎం అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. సైబిరియా నెట్ వర్క్ నుంచి యూరప్.. ఇతర ప్రాంతాలకు కూడా గ్యాస్ సరఫరా అవుతూ ఉంటుంది. పుతిన్‌తో రొస్‌నెప్ట్ ఆయిల్ హెడ్ ఇగొర్ సెచిన్, గజ్‌ప్రొమ్ ఆలెక్సి మిల్లర్ తదితరులు ఉన్నారు.












Click it and Unblock the Notifications