8 ఏళ్ల మురికివాడ కుర్రాడు యదు కల అన్నామ్రితతో నెరవేరింది

అవ‌కాశం, ప్రోత్సాహం ఉండాలే కానీ మురికివాడ నుంచైనా స‌రే మాణిక్యం పుట్టుకొస్తుంది. అలాంటి మాణిక్యం గురించే ఇప్పుడు తెలుసుకుందాం. త‌మిళ‌నాడులోని ఒక పెద్ద న‌గ‌రంలోని మురికివాడ‌లో యదు అనే 8ఏళ్ల బాలుడు త‌న త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి ఉంటున్నాడు. అత‌డి తండ్రేమో రోజువారీ కూలి ప‌నికెళ‌తాడు. అత‌డేమో పాపం త‌న కొడుకు చ‌దువుక‌య్యే ఖ‌ర్చుల‌ను భరించే స్తోమ‌త లేదు. ఆ అబ్బాయికేమో చ‌దువుకోవాల‌ని ఆశ‌.

యదుకేమో ఆట‌ల్లోనో బాగా క‌సి ఉంది. ఎప్పుడైనా మంచి క్రీడాకారుడు కావాల‌ని అత‌డి కోరిక‌. యదు వాళ్ల అమ్మ ఆ చుట్టు ప‌క్క‌ల ఇళ్ల‌లో ప‌నిచేస్తూ ఉంటుంది. అప్పుడ‌ప్పుడు యదుని తోడు తీసుకెళుతూ ఉంటుంది. అక్క‌డే పిల్ల‌ల‌తో క‌లిసి ఆడుకోవ‌డ‌మో, చ‌దువుకోవ‌డ‌మో చేస్తూ ఉండేవాడు.

యదుకు సహాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

Yadu, An 8-year-old Slum Boy From Tamil Nadu, Can Live His Dream Now

యదు ఏదైనా స‌రే త్వ‌ర‌గా నేర్చేసుకుంటాడు. అత‌డి గ్ర‌హ‌ణ శ‌క్తి అమోఘం. అక్క‌డ చుట్టుప‌క్క‌ల ఉండేవారు యదు వాళ్ల అమ్మ‌ను ఎందుకు త‌న‌ను స్కూల్‌లో చేర్చ‌డం లేదు అని త‌ర‌చూ అడిగేవారు. అయితే దానికి ఆమె స‌మాధానం మాత్రం పూట‌కు, తిండికి కూడా గ‌డ‌వ‌లేని మా కుటుంబం వాడి చ‌దువుల ఖ‌ర్చులు ఎలా భ‌రించ‌గ‌లం అని వాపోయేది.

అయితే ప‌రిస్థితులు ఎప్పుడూ ఒక‌లా ఉండ‌వు.

ఒక రోజు ఒక మ‌హిళ యదు వాళ్ల అమ్మ‌ను క‌లిసి యుదు చ‌దువు గురించి చింతించ‌న‌క్క‌ర్లేదు. ద‌గ్గ‌ర‌లోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో చేర్పించ‌మ‌ని స‌ల‌హా ఇస్తుంది. అంతేకాదు అక్క‌డ చ‌దువుతో పాటు ఉచితంగా భోజ‌నం పెడ‌తారు అని చెప్తుంది. అంతేకాదు వెంట‌నే త‌న‌ను స్కూల్‌లో జాయిన్ చేయ‌మ‌ని ప్రోత్స‌హిస్తుంది.

ఈ రోజు యుదు స్కూల్‌లో చేరి దాదాపు 3 ఏళ్లు అవుతుంది. అత‌డు మూడో త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు. అత‌ని క‌ల‌ల‌ను చేధించ‌డానికి ద‌గ్గ‌ర‌లో ఉన్నాడు పైగా ఎంతో సంతోషంగా క‌నిపిస్తాడు. ప్ర‌తిరోజు అత‌డికి స్కూల్‌లో ఆహారం దొరుకుతుంది. అన్నామ్రిత పేరుతో మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కం త‌మిళ‌నాడులో ప్రారంభ‌మైంది. ఎంతో రుచిక‌ర‌మైన‌, నాణ్య‌త గ‌ల ఆహారాన్ని విద్యార్థుల‌కు ఈ స్వచ్ఛంద సంస్థ అందిస్తుంది. ఎవ‌రైతే పేద పిల్ల‌లు బ‌డికి వెళ్లే స్థోమత లేదో వారిని ఆదుకుంటుందీ ఈ స్వ‌చ్ఛంద సంస్థ.

కొంద‌రు వ్య‌క్తులు, ఇంకా కార్పొరేట్ సామాజిక బాధ్య‌త‌( సీఎస్ఆర్‌) ద్వారా కార్పొరేట్ సంస్థ‌లు మా అన్నామ్రిత కార్య‌క్ర‌మానికి మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. యదు లాంటి వారికి చేయూత‌నందించ‌డంలో మీరూ భాగ‌స్వాముల‌వుతార‌ని ఆశిస్తున్నాం.

ధ‌న్య‌వాదాలు
అన్నామ్రిత సిబ్బంది...www.foodforchild.com

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+