యాకూబ్ మెమెన్ ఉరికి ఓకే: 75 కేజీలు (వీడియో)

ముంబై: ముంబై బాంబు పేలుళ్ల కసులో దోషిగా తేలిన యాకూబ్ మెమెన్ ను ఉరి తియ్యడానికి సర్వం సిద్దం చేశారు. ఇప్పటికే ఉరి తాడుకు ఖైదీ బరువు కంటే రెండు రెట్లు బరువు ఉండే బస్తాలతో తాళ్లను పరిశీలించారు. గత రెండు వారాల నుండి ఉరి తాళ్లను పరిక్షిస్తున్నారు.

బుధవారం సుప్రీం కోర్టు యాకూబ్ మెమెన్ కు ఉరి శిక్ష విధించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, మహారాష్ట్ర గవర్నర్ యాకూబ్ మెమెన్ క్షమాభిక్ష అర్జీని తిరస్కరించడంతో అతనిని ఉరి తియ్యడానికి అన్ని అడ్డంకులు తొలగిపోయాయి.

Yakub Memon to wake up at 3am on the day of his hanging

బుధవారం సాయంత్రం నాగ్ పూర్ సెంట్రల్ జైలులో యాకూబ్ వేలాడనున్న తాళ్లను మరోసారి పరీక్షించారు. గురువారం వేకువ జామున మూడు గంటల సమయంలో యాకూబ్ మెమెన్ నిద్రలేపి అతనిని సిద్దం చేస్తారు. అతను కోరుకున్న ఫలహారం అందిస్తారు.

తరువాత ఉదయం 7 గంటల సమయంలో జైలు సూపరింటెండెంట్, జైలు వైద్యాధికారులు, జిల్లా మెజిస్ట్రేట్, ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల సమక్షంలో యాకూబ్ మెమెన్ ను ఉరి తియ్యనున్నారు. యాకూబ్ ప్రస్తుతం ఉరి తీసే ప్రాంతం సమీపంలోని బ్యారెక్ లో ఉంటున్నాడు. యాకూబ్ 75 కేజీల బరువు ఉన్నాడని, అతను ఆరోగ్యంగానే ఉన్నాడని జైలు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+