వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

tiktok: కంత్రి భార్య, 300 టిక్ టాక్ వీడియోలతో అక్రమ సంబంధాలు, బెడ్ రూమ్ లో స్పాట్ లో లేపేసిన భర్త !

|
Google Oneindia TeluguNews

చెన్నై/ మదురై: టిక్ టాక్ మోజుతో ఇప్పటికే భారతదేశంలో ఎంతమంది జీవితాలు సర్వనాశనం అయ్యాయి. టిక్ టాక్ తో పలువురు యువకులతో 300కు పైగా పాటలు పాడి, డ్యాన్స్ లు చేస్తూ పరిచయాలు పెంచుకుని వారితో అక్రమ సంబంధం సాగిస్తున్న కంత్రి భార్య దారుణ హత్యకు గురైయ్యింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త మాటలు పెడచెవిన పెట్టి పరాయి పురుషుల వ్యామోహంతో కాపురాన్ని నిర్లక్షం చేసిన ఆమె జీవితం నాశనం అయ్యింది. చెప్పిన మాట వినకుండా టిక్ టాక్ లో వందల వీడియోలు పెట్టి అక్రమ సంబంధాలు పెట్టుకుని మా పరువు తీసిందని, అందుకే చంపేశానని భర్త పోలీసుల విచారణలో అంగీకరించాడు. భర్త నైట్ డ్యూటీలకు వెళ్లడం, భార్య ఫోన్ చేతిలో పట్టుకుని అదే పనిగా గంటలు గంటలు పరాయి పురుషులతో మాట్లాడటంతో ఆమె జీవితం అంతం అయ్యింది.

Super wife: క్యాషియర్ భర్త, నా భార్యను చూస్తే మూడ్ రాదు, మెరుపుతీగ అమ్మాయిలు, కంతిరీగ ఆంటీలతో జల్సా!Super wife: క్యాషియర్ భర్త, నా భార్యను చూస్తే మూడ్ రాదు, మెరుపుతీగ అమ్మాయిలు, కంతిరీగ ఆంటీలతో జల్సా!

నువ్వే నాప్రాణం....నా సర్వస్వం

నువ్వే నాప్రాణం....నా సర్వస్వం

తమిళనాడులోని కడలూరు జిల్లా బన్రూట్టి సమీపంలోని కాడాంబులియార్ గ్రామానికి చెందిన కుమారవేల్ అలియాస్ కుమార్ (27), నైవేలీ దిడీర్ కుప్పం ప్రాంతానికి చెందిన రాజేశ్వరి (26) ప్రేమించుకున్నారు. తరువాత పెద్దలకు నచ్చచెప్పిన కుమారవేల్, రాజేశ్వరి ప్రేమ వివాహం చేసుకున్నారు. కుమారవేల్, రాజేశ్వరి దంపతులకు 7 ఏళ్లు, 3 ఏళ్లు వయసు ఉన్న ఇద్దరు ముచ్చటైన ఇద్దరు పిల్లలు ఉన్నారు.

భర్త నైట్ డ్యూటీలతో ఒంటరిగా భార్య

భర్త నైట్ డ్యూటీలతో ఒంటరిగా భార్య

కుమారవేల్ కారు డ్రైవర్ గా చాలా కాలం పని చేశాడు. తరువాత సొంతంగా కారు తీసుకున్న కుమారవేల్ ఎక్కువగా నైట్ డ్యూటీలు చేస్తూన్నాడు. నైట్ డ్యూటీలు ఎక్కువ చేస్తున్న కుమారవేల్ పగటి పూట ఇంటిలో ఉంటున్నాడు. రాజేశ్వరికి మొబైల్ ఫోన్ల పిచ్చి ఎక్కువగా ఉంది. మొబైల్ ఫోన్ తో ఎక్కువ కాలం గడుపుతున్న రాజేశ్వరికి ఇంతకు ముందు ఆమె భర్త కుమారవేల్ ఎందుకు అలా చేస్తున్నావు, ఊరికే లేనిపోని ఆలోచనలు వస్తాయి, మొబైల్ ఫోన్ కు వీలైనంత దూరంగా ఉండాలి, నీకు బోరు కొడితే పిల్లలతో ఆడుకోవాలని సూచించాడు.

కొంప ముంచిన స్మార్ట్ ఫోన్

కొంప ముంచిన స్మార్ట్ ఫోన్

తనకు స్మార్ట్ మొబైల్ ఫోన్ కావాలని రాజేశ్వరి చెప్పడంతో అతను కొత్త మొబైల్ ఫోన్ తీసిచ్చాడు. ఇక అంతే స్మార్ట్ మొబైల్ ఫోన్ వచ్చిన తరువాత టిక్ టాక్ లోకి రాజేశ్వరి ఎంట్రీ ఇచ్చింది. టిక్ టాక్ లో పరిచయం అయిన యువకులతో పాటలు పాడుతూ, డ్యాన్స్ లు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేసి ఫ్యాన్స్ ను సంపాధించుకుంది.

టిక్ టాక్ వీడియోలు చూసి భర్త షాక్.... ఇల్లు మార్చితే ?

టిక్ టాక్ వీడియోలు చూసి భర్త షాక్.... ఇల్లు మార్చితే ?

టిక్ టాక్ లో రాజేశ్వరి వీడియోలు చూసిన కొందరు స్నేహితులు, సాటి డ్రైవర్లు ఆ వీడియోల్లో ఉన్నది నీ భార్య కదా ? అని కుమారవేల్ ను ప్రశ్నించారు. టిక్ టాక్ లోని కొన్ని వీడియోలు చూసిన భర్త కుమారవేల్ షాక్ కు గురైనాడు. టిక్ టాక్ లో లెక్కలేనన్ని వీడియోల్లో భార్య రాజేశ్వరి దర్శనం ఇవ్వడంతో కుమారవేల్ అయోమయానికి గురైనాడు. టిక్ టాక్ పిచ్చితో భార్య రాజేశ్వరి చెప్పిన మాట వినడం లేదని తెలుసుకున్న కుమారవేల్ నాలుగు నెలల క్రితం బన్రూట్టి అన్వర్ షా నగర్ లోని నాలుగో వీధిలో అద్దె ఇంటిని తీసుకుని అక్కడికి మకాం మార్చాడు. అన్వర్ షా నగర్ లోకి ఇంటిని మార్చిన తరువాత అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న మురుగన్ అనే వ్యక్తితో రాజేశ్వరి అక్రమ సంబంధం పెట్టుకుంది.

 ఫోన్ ఎంగేజ్.... టవర్ లేదు ఏం....నేనే ఎం చెయ్యాలి ?

ఫోన్ ఎంగేజ్.... టవర్ లేదు ఏం....నేనే ఎం చెయ్యాలి ?

రాత్రి డ్యూటీకి వెళ్లిన కుమారవేల్ అనేక సార్లు భార్య రాజేశ్వరి మొబైల్ కు ఫోన్ చేశాడు. అయితే ఎప్పుడు ఫోన్ చేసిన భార్య రాజేశ్వరి ఫోన్ ఎంగేజ్ రావడంతో కుమారవేల్ విసిగిపోయాడు. ఇంటికి వెళ్లిన కుమారవేల్ ఎవరితో మాట్లాడుతున్నావ్ ? ఎప్పుడు చూసినా మొబైల్ ఫోన్ ఎంగేజ్ వస్తోంది ? ఎందుకు ? అని ప్రశ్నించాడు. భర్త కుమారవేల్ ఎప్పుడు అడిగినా ఏదో ఒక సినిమా స్టోరీ, టవర్ లేదు, నన్ను ఏం చెయ్యమంటావ్ అంటూ కథలు చెప్పిన రాజేశ్వరి తప్పించుకోవడానికి ప్రయత్నించింది.

బెడ్ రూమ్ లో స్పాట్ లో లేపేసిన భర్త

బెడ్ రూమ్ లో స్పాట్ లో లేపేసిన భర్త

2020 ఫిబ్రవరి 17వ తేదీ అర్దరాత్రి ఇంటికి వెళ్లిన కుమారవేల్ షాక్ కు గురైనాడు. ఇంటిలో భార్య రాజేశ్వరి వేరే వ్యక్తితో నగ్నంగా కనపడటంతో కుమారవేల్ ఊగిపోయాడు. వెంటనే కారు జాకీ ఎత్తడానికి ఉపయోగించే ఇనుపరాడ్ తీసుకుని దాడి చెయ్యడానికి ప్రయత్నించాడు. భార్య రాజేశ్వరితో పాటు అక్కడే ఉన్న వ్యక్తి తప్పించుకుని పరారైనాడు. వెంటనే ఇనుప రాడ్ తీసుకున్న కుమారవేల్ భార్య రాజేశ్వరి తల మీద దాడి చెయ్యడంతో ఆమె కుప్పకూలిపోయింది. తలకు తీవ్రగాయాలైన రాజేశ్వరి బెడ్ రూమ్ లో ఎలా నగ్నంగా ఉందో అలాగే ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

భార్య 300 వీడియోలు....బెయిల్ మీద వచ్చిన భర్త

భార్య 300 వీడియోలు....బెయిల్ మీద వచ్చిన భర్త

రాజేశ్వరి హత్యకు గురి కావడంతో ఆమె తల్లి సుశీల అల్లుడు కుమారవేల్ మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజేశ్వరి తల్లి సుశీల ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. తన మాట వినకుండా తన భార్య రాజేశ్వరి పరాయి మగాళ్లతో ఆడుతూ పాడుతూ 300కు పైగా టిక్ టాక్ వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేసిందని, వేరే వ్యక్తులతో అక్రమ సంబంధం సాగిస్తుందని తెలియడంతో ఆమెను హత్య చేశానని కుమారవేల్ అంగీకరించాడు. సుమారు మూడు నెలల తరువాత బెయిల్ మీద జైలు నుంచి బయటకు వచ్చిన కుమారవేల్ ఇప్పుడు భార్య రాజేశ్వరి హత్య కేసులో కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు. మొత్తం మీద టిక్ టాక్ వీడియోల పిచ్చితో ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త చేతిలోనే రాజేశ్వరి హత్యకు గురికావడం కలకలం రేపింది.

English summary
Year Ender 2020: Hsband murdered wife near Kuddalore in Tamil Nadu due to her illegal affair and love.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X