Illegal affair: భర్త ఫ్రెండ్, భార్య ప్లాన్ A,B స్కెచ్, భవాని సూపర్ ప్లాన్, రసిక సామ్రాజ్యంతో సీన్ రివర్స్ !

చెన్నై: అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భార్య తనకు సర్వస్వం అని భర్త భావించాడు. భర్త ఫ్రెండ్, పక్కవీదిలో మరో ఇద్దరు ప్రియులతో భార్య రాసలీలలు సాగించింది. విషయం తెలుసుకున్న భర్త భార్యను గట్టిగానే మందలించాడు. నా భర్త బతికుండగా తాను కామవాంఛ తీర్చుకోలేనని భార్య నిర్ణయించింది. ప్రియుడితో కలిసి భర్తకు బిర్యానీలో విషం పెట్టి హత్య చెయ్యాలని ప్రయత్నించడంతో Plan A ఫెయిల్ అయ్యింది. ఒకటి పోతే ఇంకోటి అంటూ భార్య Plan Bతో భర్తను చంపేయడంలో భార్య సక్సెస్ అయ్యింది. అయితే పోలీసుల ముందు కుప్పిగంతులు వెయ్యాలని ప్రయత్నించిన కిలాడీ భార్య అసలు బండారం బయటపడింది.

 పూనమల్లి భవాని

పూనమల్లి భవాని

చెన్నై సిటీలోని పూనమల్లి ప్రాంతంలో తరణిధరన్ అనే కారు డ్రైవర్ నివాసం ఉంటున్నాడు. తరణిధరన్ కు భార్య భవాని, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వివాహం అయిన తరువాత భార్య భవాని భర్త తరణిధరన్ తో హ్యాపీగా కాపురం చేసింది. భార్య భవాని, ఇద్దరు కుమార్తెలతో కలిసి తరణిధరన్ జీవితం సాఫిగా సాగిపోయింది. అదే సమయంలో తరణిధరన్, భావాని కాపురంలోకి ఓ వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు.

 భర్త ఫ్రెండ్ తో లింక్, తుమ్మినా తెలిసిపోతుంది

భర్త ఫ్రెండ్ తో లింక్, తుమ్మినా తెలిసిపోతుంది

భర్త తరణిధరన్ కు దినేష్ అనే స్నేహితుడు ఉన్నాడు. దినేష్ కూడా కారు డ్రైవర్ గానే పని చేస్తున్నాడు. గత ఏడాది చివరిలో తరణిధరన్ తన స్నేహితుడు దినేష్ ను ఇంటికి పిలుచుకుని వెళ్లి భార్య భవానికి పరిచయం చేశాడు. తరణిధరన్ చేసిన తప్పు అతని ఫ్రెండ్ దినేష్ ను ఇంటికి పిలుచుని వెళ్లడమే. ఆ సమయంలో పరిచయం అయిన దినేష్, భవానిల పరిచయం తరువాత ఫోన్లలో మాట్లాడుకోవడం వరకు వెళ్లింది. కారు డ్రైవర్లు ఎవరెవరు ఎప్పుడు ఏ ప్రాంతాలకు వెలుతున్నారు అనే విషయం సాటి డ్రైవర్లు తెలుస్తోంది. ఇలా తరణిధరన్ దూర ప్రాంతాలకు ఎప్పుడు కారులో బాడుగకు వెళ్లాడు అనే విషయం తెలుసుకుంటున్న దినేష్ చిన్నగా అతని ఇంటికి వెళ్లేవాడు. ఆ సమయంలో తరణిధరన్ భార్య భవానిని లైన్ లో పెట్టిన దినేష్ ఆమెతో ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టాడు.

 బెడ్ రూమ్ లో భార్య టైమ్ బ్యాడ్

బెడ్ రూమ్ లో భార్య టైమ్ బ్యాడ్

గత జులై నెలలో మదురైకి వెలుతున్నానని తరణిధరన్ అతని ఫ్రెండ్ దినేష్ కు చెప్పాడు. తరణిధరన్ చెన్నై దాటి వెళ్లిపోయాడని, అతను రేపు వస్తాడని తెలుసుకున్న దినేష్ రాత్రి అతని ఇంటికి వెళ్లాడు. అయితే కారు అద్దెకు తీసుకున్న వాళ్లు పని ఉందని, రేపు వెలుదామని తరణిధరన్ కు చెప్పడంతో అతను రాత్రికి ఇంటికి వెళ్లాడు. అర్దరాత్రి దినేష్, తన భార్య భవాని ఇంటిలో బెడ్ రూంలో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలుసుకున్న తరణిధరన్ దిమ్మతిరిగిపోయింది.

 భర్త వార్నింగ్ ఇస్తే భార్య బయట జల్సా

భర్త వార్నింగ్ ఇస్తే భార్య బయట జల్సా

ఇంట్లోని బెడ్ రూంలో భార్య భవాని, ఫ్రెండ్ దినేష్ ను చూసి రగిలిపోయిన తరణిధరన్ చేతికి చిక్కిన కర్ర తీసుకున ఇద్దరిని చితకబాదేశాడు. చుట్టుపక్కల వాళ్ల వచ్చి తరణిధరన్ కు సర్దిచెప్పి దినేష్ కు నాలుగు దెబ్బలు వేశారు. ఇంకోసారి నా ఇంటి పక్కకు చూసినా, ఈ వీధిలోకి వచ్చినా నీ అంతు చూస్తానని తరణిధరన్ అతని స్నేహితుడు దినేష్ కు వార్నింగ్ ఇచ్చాడు. అప్పటి నుంచి దినేష్, భవాని బయట కలుసుకుని ఎంజాయ్ చేస్తున్నారు.

 భార్య ప్లాన్ A అట్టర్ ప్లాప్

భార్య ప్లాన్ A అట్టర్ ప్లాప్

చెన్నై సిటీలో కరోనా వైరస్ దెబ్బకు జులై నెలలో కూడా పూర్తిగా లాక్ డౌన్ విధించడంతో కారు బాడుగలు లేక తరణిధరన్ ఇంటి దగ్గరే ఉంటున్నాడు. 2020 జులై 21వ తేదీన దినేష్ భవానికి ఫోన్ చేపి తాను పురుగుల మందు తీసుకుని వస్తానని, దానిని ఆహారంలో పెట్టి నీ భర్తకు ఇస్తే చస్తాడని చెప్పాడు. రాత్రి బిర్యానీ చేసిన భవాని అందులో పురుగులమందు కలిపి భర్తకు పెట్టింది. రాత్రి బిర్యానీ తిన్న తరణిధరన్ ఉదయం లేచి వాంతులు చేసుకున్నాడు తప్పా అతను చావలేదు. భార్య భవాని ప్లాన్ A ప్లాప్ అయ్యింది.

 ప్లాన్ B భర్తను చంపేసిన భార్య

ప్లాన్ B భర్తను చంపేసిన భార్య

బిర్యానీ తిన్న మురుసటి రోజు ఉదయం వాంతులు చేసుకుని ఎక్కువ నీరసంగా ఉండటంతో తరణిధరన్ ఇంట్లో నిద్రపోయాడు. భవాని ప్రియుడు దినేష్ కు ఫోన్ చేసి నా భర్త చనిపోలేదని చెప్పింది. దినేష్ నేరుగా భవాని ఇంటికి వెళ్లాడు. అనారోగ్యంతో నిద్రపోతున్న తరణిధరన్ ను అతని భార్య భవాని, ప్రియుడు దినేష్ కలిసి దుప్పటితో అతని గొంతు నులిమి చంపేశారు. లాక్ డౌన్ కారణంగా విపరీతంగా అప్పులు చేసిన తన భర్త తరణిధరన్ రుణం ఇచ్చిన వారి నుంచి వేధింపులు ఎక్కువ కావడంతో ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులకు సమాచారం ఇచ్చింది.

 భవాని కిలాడీ, రాసలీలలుఎంత మందితో అంటే ?

భవాని కిలాడీ, రాసలీలలుఎంత మందితో అంటే ?

చెన్నై సిటీ పోలీసులు తరణిధరన్ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టుం చేయించారు. తరణిధరన్ ఆత్మహత్య చేసుకోలేదని, విషం పెట్టి గొంతు బిగించి చంపేశారని వైద్యులు నివేదిక ఇచ్చారు. పోలీసులకు అనుమానం వచ్చి భవాని మొబైల్ స్వాధీనం చేసుకుని బెండ్ తియ్యడంతో ప్రియుడు దినేష్ తో కలిసి తన భర్తను చంపేశానని ఆమె అంగీకరించింది. పోలీసుల విచారణలో కొత్త విషయాలు వెలుగు చూశాయి. దినేష్ తోనే కాకుండా భవాని పూనమల్లి ప్రాంతంలో నివాసం ఉంటున్న మరో ఇద్దరితో అక్రమ సంబంధం సాగిస్తోందని, వారితో నిత్యం ఫోన్ లో మాట్లాడినట్లు వివరాలు తెలిశాయని పూనమల్లి పోలీసులు చెప్పారు. భవాని అరెస్టుతో ఆమెతో రంకు సాగించిన ముగ్గురుమొనగాళ్లు తప్పించుకుని తిరిగి చివరికి రెండు నెలల తరువాత పోలీసులకు చిక్కిపోయారు. లాక్ డౌన్ ప్లాన్ తో భర్తను భార్య స్కెచ్ లు మీద స్కెచ్ లు వేసి హత్య చెయ్యడం 2020లో చెన్నై సిటీలో కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+