Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Year Ender 2024: విలక్షణ తీర్పు - ఓటరు నేర్పిన పాఠం..!!

ఈ ఏడాది 2024 దేశంలో అన్ని పార్టీలకు ఓటరు పాఠం నేర్పిన సంవత్సరం. ఎవరికి ఎప్పుడు ఎలా తీర్పు ఇవ్వాలో ఓటరు తన ఓటుతో స్పష్టం చేసారు. దేశ వ్యాప్తంగా 2024 లో మొత్తంగా ఎనిమిది రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. 2024 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏకు పట్టం కట్టిన ప్రజలు...వేర్వేరు రాష్ట్రాల్లో మాత్రం తీర్పు భిన్నంగా ఇచ్చారు. ఎన్డీఏ, ఇండి కూటమితో సహా ప్రాంతీయ పార్టీలకు విలక్షణ తీర్పుతో షాక్ ఇచ్చారు.

ఆ రెండు రాష్ట్రాల్లో
2024లో తొలుత ఎన్నికలు జరిగిన రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం. ఈ ఎన్నికల్లో అరుణాచ ల్ ప్రదేశ్‍లో బీజేపీ తిరిగి అధికారాన్ని కైవసం చేసుకుంది. దీంతో పెమా ఖండు మళ్లీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అలాగే సిక్కింలో క్రాంతి కారి మోర్చా పార్టీ మరోసారి ఘన విజయం సాధించింది. దీంతో ప్రేమ్ సింగ్ తమాంగ్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఏపీలో జరిగిన ఎన్నికల్లో 2019 లొ 151 సీట్లు కట్టబెట్టి అధికారం ఇచ్చిన రాష్ట్ర ప్రజలు అదే వైసీపీని 11 సీట్ల కు పరిమితం చేసి ఎన్డీఏ కూటమికి అధికారం అప్పగించారు. ఒడిశా ఎన్నికల్లో 25 ఏళ్ల బిజు జనతాదళ్ పార్టీ పాలనకు ముగింపు పలికారు. 147 స్థానాల్లో 78 సీట్లలో బీజేపీని గెలిపించి ఆ పార్టీకి అధికారం అప్పగించారు.

Year Ender 2024 NDA India Block got mixed results in Eight Assembly elections in 2024

హర్యానా - జమ్ము కాశ్మీర్ లో
ఇక, హర్యానా - జమ్ము కాశ్మీర్ ఎన్నికలు రెండు ప్రధాన కూటములకు ప్రతిష్ఠాత్మకంగా నిలిచాయి. అయితే, అనూహ్య తీర్పు వెలువడింది. 370 అధికరణ రద్దు.. రాష్ట్రపతి పాలన తరువాత జరిగిన జమ్ము కాశ్మీర్ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి పట్టం కట్టారు. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఉపాధ్య క్షుడు ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. హర్యానాలో బీజేపీ మరోసారి అధికార పీఠాన్ని దక్కించుకోంది. దీంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైనీ మళ్లీ బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత మహారాష్ట్ర - జార్ఖండ్ ఎన్నికల్లోనూ రెండు కూటములు హోరా హోరీగా తలపడ్డాయి. కానీ, రెండు రాష్ట్రాల్లోనూ ప్రజాభిప్రాయం స్పష్టంగా వెల్లడించారు.

జార్ఖండ్ - మహారాష్ట్రలో
జార్ఖండ్‍లో ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలైన జార్కండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్ పార్టీలు అత్యధిక స్థానాలను గెలుచుకొన్నాయి. దీంతో మరోసారి జార్ఖండ్ ముక్తి మోర్చా అధినేత హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా వరుసగా మళ్లీ బాధ్యతలు చేపట్టారు. మహారాష్ట్రలో బీజేపీ అధిక సీట్లు గెలవటంతో పాటుగా మూడు పార్టీల ఎన్డీఏ కూటమి భారీ మెజార్జీతో అధికారం నిలబెట్టుకుంది. ఈ ఫలితాలతో బీజేపీ కేంద్ర నాయకత్వం జమిలి దిశగా అడుగులు వేయటానికి కారణంగా నిలిచింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేందర్ ఫడ్నవీస్ బాధ్యతలు స్వీకరించారు. ఇలా.. 2024 జాతీయ పార్టీలకు మిశ్రమ ఫలితాలతో 2025 ప్రారంభం వేళ కీలక హెచ్చరిక చేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+