గురువారం... సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న యడ్యూరప్ప...
కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలడంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నద్దం అవుతోంది. తాజా పరిణామాలపై చర్చించేందుకు బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ అనంతరం సమావేశ మందిరంలో భేటి అయ్యారు. ఈ నేపథ్యంలోనే బుధవారం గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరనున్నారు. అనంతరం పార్టీ లెజిస్లేచర్ పార్టీ సమావేశం కూడ నిర్వహించనున్నారు.
ఆ సమావేశంలో పార్టీ నేతను ఎన్నుకోనున్నారు. కాగా సీఎల్పీ నేతగా ఎన్నుకున్న సభ్యుడే సీఎం అభ్యర్థిగా ప్రమాణ స్వీకారం చేయనున్నాడు. ఈ సమావేశంలో ఎల్పీ నేతగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న యడ్యురప్పను ఎన్నుకోనున్నారు. అనంతరం గురువారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత గవర్నర్ ఇచ్చిన సమయాన్ని బట్టి సభలో తమ బలాన్ని బీజేపీ నిరూపించుకోవాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications