ఒకే, ఆ యువతినే పెళ్లి చేసుకుంటా: అబూసలేం
ముంబై: ముంబై వరుస బాంబుపేలుళ్ల నిందితుడు, మాఫియా డాన్ అబూసలేం.. తనను పెళ్లి చేసుకుంటానని కోర్టును ఆశ్రయించిన యువతిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించాడు. అబూసలేంను పెళ్లి చేసుకొనేందుకు అనుమతివ్వాలని ఓ 26 ఏళ్ల యువతి తన న్యాయవాది ఫర్హానా షా ద్వారా ప్రత్యేక టాడా కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఆమె దరఖాస్తును పరిశీలించి, ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం రిజిస్ట్రార్ ముందు తామిద్దరం పెళ్లి చేసుకునేందుకు అనుమతించాలని అబూసలేం సోమవారం కోర్టును కోరాడు. అయితే ఆ యువతి తప్పనిసరి పరిస్థితుల్లో ఈ పెళ్లికి అంగీకరించినట్టు జరిగిన పరిణామాలను బట్టి తెలుస్తోంది.

అబూసలేం ఆ యువతిని రహస్యంగా పెళ్లి చేసుకున్నట్టు నిరుడు ఒక స్థానిక పత్రికలో కథనం ప్రచురితమైంది. దీనిపై దర్యాప్తు సందర్భంగా పోలీసులు ఆమెతో సలీం కలిసి దిగిన ఫొటోను పలువురికి చూపించారు. దీంతో ఆమె ప్రవర్తనపై మచ్చ పడినట్లయింది. అప్పటినుంచి ఆమెనెవరూ పెళ్లి చేసుకునేందుకు ముందుకు రావడం లేదు.
తన కారణంగా ఆమెకు జరిగిన అవమానానికి, ఆమెను పెళ్లి చేసుకోవడం ద్వారా న్యాయం చేస్తానని అబూసలేం కోర్టుకు తెలిపాడు. అప్పుడే ఆమె సమాజంలో గర్వంగా తల ఎత్తుకుని తిరగగలదని పేర్కొన్నారు. ఆ యువతికి క్షమాపణ చెప్పిన సలేం, ఆమె చూపిన ధైర్యానికి అభినందనలు కూడా తెలిపాడు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications