నేను స్త్రీని, వక్షోజాలుంటాయి: దీపికా పడుకొనే ఫైర్
ముంబై: ఏ సందర్భంలోనైనా శాంతంగా కనిపించే బాలీవుడ్ భామ దీపికా పడుకొనేకు అగ్రహం వచ్చింది. మీడియాపై ఆమె సోమవారంనాడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వస్త్రధారణను కించపరుస్తూ ఓ పత్రిక వార్తాకథనం రాసిందనే ఆరోపణపై ఆమె తీవ్రంగా స్పందించారు.
ఆ దినపత్రికపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్విట్టర్‌లో తన వ్యాఖ్యలను రాశారు. మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌లో ఆమె వరుసగా తన కోపానలాన్ని వ్యక్తం చేస్తూ వెళ్లారు. తాను మహిళనని, తనకు వక్షోజాలుంటాయని అంటూ అందుకు నీకేమైనా అభ్యంతరమా అని మీడియాను అడిగారు.

దీపికా పడుకొనేకు మద్దతుగా ఆమె మద్దతుదారులు కూడా ట్విట్టర్‌ను ఆశ్రయించారు. గంటలోపల 1500 మందికిపైగా అభిమానులు మీడియాపై విరుచుకుపడ్డారు.
నిజానికి, ఓ ఆంగ్ల దినపత్రిక వార్తాకథనం రాస్తూ పోస్టు చేసిన వీడియా చాలా పాతిది. అది 2013లో చెన్నై ఎక్స్‌ప్రెస్ సినిమా ట్రైలర్ విడుదల సందర్భంగా వచ్చిన వార్తాకథనం.












Click it and Unblock the Notifications